Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెడ్డిగూడెంలో విషాదఛాయలు
నవతెలంగాణ-మద్దిరాల
హైదరాబాద్లోని కుషాయిగుడ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజా మున జరిగిన ఘోర అగప్రమాదంలో మండలంలోని రెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనమైన సంఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన రెట్నేని జెన్నయ్య,భద్రమ్మ దంపతులకు ఇద్దరు కూతుర్లు,ఒక కుమారుడు రెట్నెని నరేష్(36)తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన సుమ(30)తో వివాహమైంది.వీరికి ఇద్దరు కుమారులు సాత్విక్(7) జస్విత్ (5) నరేష్. తల్లి భద్రమ్మ కొన్నేండ్లుగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నది.తల్లి దండ్రులను పోషించుకోడం కోసం తన భార్య పిల్లలతో హైదరాబాద్కు వలసొచ్చి ఒక ప్రైవేట్ వాహనం డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు.పని ముగించుకొని ఆదివారం రాత్రి సుమారు 2 గంటలకు కుషాయిగూడలోని అద్దె ఇంటికి చేరుకుని నిద్రించాడు.ఉదయం నాలుగుగంటల సమయంలో తాను ఉంటున్న అద్దె ఇంటి పక్కన ఉన్న టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం జరిగి తాను వుంటున్న ఇంటిని అగ్ని మంటలు అలుముకోడంతో మంటల నుండి తాను తన భార్య సుమ, చిన్న కుమారుడు జ్యోషిత్ను రక్షించుకోవడం కోసం తీవ్ర ప్రయత్నం చేశాడు.అప్పటికే మంటలు ఎక్కువకావడంతో మంటల్లో కాలి అక్కడికక్కడే మృతి చెందారు.నరేష్ పెద్ద కుమారుడు సాత్విక్ తన మేనత్త ఇంటికి వెళ్ళడంతో అతను బతికిపోయాడు.ఇదిలా ఉండగా ఒకే ఇంట్లో ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇంటిని పోషించే కుమారుడు, కోడలు,ముక్కు పచ్చలు ఆరని మనువడు అగ్ని కి ఆహుతి కావడంతో ఆ వృద్ధ తల్లిదండ్రుల దుఃఖం ఆపడం ఎవరితరం కావడం లేదు.అనాథగా మారిన పెద్ద కుమారుడు హత్విక్ అమ్మనాన్నలు కావాలని ఏడవడంతో వచ్చిన బందువులు,గ్రామస్తులు దుఃఖ సముద్రంలో మునిగిపోయారు.