Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తప్పిన ముప్పు
- నిబంధనలకు నీళ్లు,అనుమతులకు తూట్లు
- చెరువు పక్క నిర్మాణమే ప్రమాదానికి కారణం
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
ఈత అనగానే సాధారణంగా ఉత్తమ వ్యాయమాల జాబితాలో చేరుస్తారు.ఈత మనల్ని శారీరకంగా, మానసికంగా దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.అందుకే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని వేసే విశాలల్లో ఈత నేర్పించాలని నిర్ణయించుకుంటారు.సహజంగా ఈత పిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ అదే ఈత పిల్లల పాలిట యమపాషాలుగా మారే ప్రమాదం ఉంది.సూర్యాపేట పట్టణంలోని హైటెక్ బస్టాండ్ సమీపంలో ఉన్న కేేపీరెడ్డి సిమ్మింగ్‌ఫూల్‌లో శనివారం సాయంత్రం ప్రమాదవశాత్తు ఘటన జరిగి చుట్టూ ప్రహరీ అకస్మాత్తుగా ఒక పక్కకు ఒరిగి అందులో నీరంతా బయటకు వెళ్ళిపోయింది.అయితే సంఘటన జరిగిన సమయంలో ఈతకొలనులో ఎవరూ లేకపోవడం అదష్టమని చెప్పుకోవచ్చు.అందులో ప్రహరీ గోడ స్విమ్మింగ్‌ఫూల్‌లో పడక పక్కన ఉన్న కాళీ ప్లాట్లులో పడటంతో ఊపిరి పీల్చుకున్నారు.
నిబంధనలకు నీళ్లు
తమ పిల్లలకు ఈత నేర్పించాలని ఆత్రుత,స్విమ్మింగ్ పూల్‌లో ఎటువంటి రక్షణ సౌకర్యాలు ఏర్పాటు చేశారా అనేది కనీసం తల్లిదండ్రులు తెలుసుకోలేక పోతున్నారు.భద్రతా పరికరాలు ఉన్నాయా స్విమ్మింగ్ లైవ్ గార్డు పిల్లలను రక్షించే స్విమ్మింగ్ లైఫ్ గాడ్ దగ్గర పిల్లలు ఈత నేర్చుకుంటారు.పిల్లలను స్విమ్మింగ్ పూలు పంపేముందు స్విమ్మింగ్ పూల్ పరిశుభ్రత గురించి తల్లిదండ్రులు నిర్ధారించుకోవాలి.కొన్నిసార్లు స్విమ్మింగ్ పూల్ నీటిలో క్లోరిన్ పరిణామం చాలా ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో చాలా చోట్ల ఈత కొలనులోని నీరు చాలా రోజులుగా మార్చరు.వర్షం నీరు కూడా దాంట్లో పేరుకుపోతుంది.అటువంటి పరిస్థితులు పిల్లలు చర్మవ్యాధులకు వైరల్,ఇన్ఫెక్షన్కు గురవుతారు.పైనిబంధనలు ఏమీ పట్టని పట్టణములోని నిర్వాహకులు ఇష్టా రీతిన వ్యవహరిస్తూ నిబంధనలకు నీళ్లు వదిలారు.
చెరువు పక్కన నిర్మాణం ప్రమాదకరం..
కాగా స్విమ్మింగ్ పూల్ నిర్మించిన ప్రదేశం చౌదరిచెరువు పక్కనే ఉండటం వలన ఎప్పుడు నీటి తరంగాల తాకిడి స్విమ్మింగ్ పూల్ లోని నీటిపై ఉంటుంది.దీనివల్ల స్విమ్మింగ్ పూల్ నీటి పై ఒత్తిడి సహజంగానే ఉంటుంది.చెరువులోని అలలు, తరంగాలు స్విమ్మింగ్‌పూల్‌లో నీటిని తడుతూ ఉంటాయి.దీనివల్ల పక్కన నిర్మాణ గోడలు తట్టుకోలేక పోతాయి.దానివల్ల ఎంతపెద్ద కట్టడమైన కొన్ని రోజులకు భూస్థాపితమవుతుంది.మామూలు ప్రదేశాల్లో కంటే చెరువు పక్కన నిర్మాణం వల్ల స్విమ్మింగ్‌పూల్‌లో భద్రత తక్కువగా ఉంటుంది. కానీ దాని నిర్వాహకులు ఇదేమీ పట్టించుకోకుండా మున్సిపాలిటీ వారి అనుమతులకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టారు.మొదటగా అది ఒక రిసార్ట్‌గా ఉండి ఆ తర్వాత కార్ల మెకానిక్షెడ్గా ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్‌గా నిర్మాణం చేపట్టారు.ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి అన్ని అనుమతులను ఇచ్చిన తర్వాతే నిర్మాణం చేపడితే ప్రమాదం లేదని గ్రహించిన తర్వాతే అక్కడ అనుమతులు ఇవ్వాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.రాబోయే రోజుల్లో పెను ప్రమాదం జరగకముందే అధికారులు మేలుకోవాలని ప్రజలు కోరుతున్నారు.