Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బండ శ్రీశైలం
నవతెలంగాణ-చిట్యాలటౌన్
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బండ శ్రీశైలం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిట్యాల మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రంను ఆదివారం ఆయన రైతు సంఘం, సీపీఐ(ఎం) మండల నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వడగండ్ల వానకు వరి పంట దెబ్బ తిన్న రైతులను ఆదుకోవాలని కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మౌళిక వసతులైన మంచి నీరు, టెంట్ వంటి సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సరిపడా గోనేసంచులు సరిపడా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లాకమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య, మండల నాయకులు నారబోయిన శ్రీనివాసులు, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఐతరాజు నర్సింహ, చిర్రబోయిన గట్టయ్య, బొలుగూరి లింగయ్య, రాములు, రాములమ్మ, సిలివేరు చంద్రయ్య, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.