Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటరూరల్
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జెడ్పీటీసీ జీడిబిక్షం అన్నారు.సోమవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో గ్రామాల అభివృద్ధికి అధిక నిధులు ఇవ్వడం వలన అన్ని గ్రామాలు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులకు ఎంపిక కావడం జరిగిందన్నారు.సర్వసభ్య సమావేశంలో పలువురు ప్రజా ప్రతినిధులు పలు,సమస్యలపై అధికారులను నిలదీశారు.ఇమాంపేట ఎంపీటీసీ మామిడి కిరణ్ మాట్లాడుతూ జన ఆరోగ్య సమితి నూతన పథకాన్ని అన్ని గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు.కేసారం ఎంపీటీసీ వాంకుడోత్ బాలాజీ మాట్లాడుతూ ఐకేపీ సెంటర్లలో ధాన్యంకొనుగోలు త్వరగా ప్రారంభించి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు.సమీపంలో ఉన్న మిల్లులకు ట్యాగింగ్ చేయాలని కోరారు.ఐకేపీ కేంద్రాలలో మంచినీటి సౌకర్యం,టెంట్ సౌకర్యం కల్పించాలన్నారు.లక్ష్మీతండా సర్పంచ్ లునావత్ సూర్యానాయక్ మాట్లాడుతూ వేసవి దృష్ట్యా గ్రామాలలో నీటి సమస్య తలెత్తకుండా మిషన్ భగీరథ ద్వారా మంచినీరందించాలని సభ దృష్టికి తీసుకొచ్చారు.ఈ సందర్భంగా ఎంపీపీ,జెడ్పీటీసీ మాట్లాడుతూ గ్రామాలలో క్షేత్ర పర్యటన చేయగా మిషన్ భగీరథ నీళ్లు సక్రమంగా గ్రామాలలో అందడం లేదని ప్రజలు తమ దృష్టికి కూడా తీసుకొచ్చారని, సంబంధితశాఖ అధికారి భరత్‌ను హెచ్చరించి పది రోజులలో నీటి సమస్య పరిష్కరించాలని సూచించారు.ఆయిల్ఫామ్ తోటలను రైతులు సాగు చేసే విధంగా ఉద్యానవన శాఖ అధికారులు ప్రతి గ్రామంలో రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులకు పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ గోపి అవగాహన కల్పించి, ఒక యూనిట్ విలువ ఒక లక్షా75 వేలకు గాను లబ్దిదారుడు రూ.43,750 రూపాయలు తన వాటా బ్యాంకులో జమ చేసేలా ప్రోత్సహించాలన్నారు.ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన గేదెలు నేటికీ కొంతమందికిపంపిణీ కాకపోవడం కారణమేమని ఎంపీటీసీ బాలాజీ డాక్టర్ గోపిని నిలదీశారు.సంబంధిత పథకం గురించి సంబంధిత ఎస్సీ కార్పొరేషన్ ఈడీని సంప్రదించాలని డాక్టర్ గోపి స్పందించారు.రామన్నగూడెం సర్పంచ్ కత్తుల మల్లయ్య మాట్లాడుతూ విద్యుత్ వైర్లు కిందికి ఉండి ప్రమాదకరంగా ఉన్నాయని విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకురాగా ఏఈ అనిల్‌కుమార్ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎంపీఓ పరంకుశరావు, సూపరింటెండెంట్ లక్ష్మీ, వివిధ శాఖల అధికారులు,ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.