Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
ధాన్యం కొనుగోలుకేంద్రాలలో ధాన్యం కొనుగోలు చేయాలని కోదాడ -ఖమ్మం ప్రధాన రహదారిపై తమ్మర రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఈనెల 11వ తేదీన కోదాడ పీఏసీఎస్్ పరిధిలోని తమ్మర గ్రామశివారులో ధాన్యం కొనుగోలుకేంద్రాన్ని ఏర్పాటు చేశారన్నారు.కేంద్రంలో రైతులు వడ్లు కొనుగోలు చేయాలని కుప్పలు పోశారు. కానీ ఇంతవరకు మిల్లు అలాట్మెంట్ చేయలేదన్నారు.ట్యాబ్‌లో రైతుల వివరాలు కూడా లేవన్నారు. అధికారులు పొంతనలేని సమాధానాలు చెబుతున్నారన్నారు.దీనికి తోడు వాతావరణం కూడా సరిగాలేదని, ఎప్పుడు వర్షం పడుతుందో తెలియడం లేదని రైతులు ఆవేదన పడుతున్నారన్నారు.దీంతో ఆగ్రహించిన రైతులు కోదాడ- ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు.దీంతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు ఆగాయి.విషయం తెలుసుకున్న అనంతగిరి పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని రైతులను ఆర్డీఓ కార్యాలయానికి తరలించారు.మంగళవారంలోగా మిల్లును అలాట్మెంట్ చేస్తామని ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తామని ఆర్డీఓ కిషోర్‌కుమార్ హామీతో వెనుదిరిగి వెళ్లారు.మంగళవారం కూడా ధాన్యం కొనుగోలు ప్రారంభించక పోతే బుధవారం పెద్దఎత్తున ధర్నాకు దిగుతామని హెచ్చరించారు.