Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా నాయకులు రొండి శ్రీనివాస్
నవతెలంగాణ-మాడుగులపల్లి
భవననిర్మాణ కార్మికులకు వెంటనే లేబర్ కార్డులను మంజూరు చేయాలని సీఐటీయూ జిల్లా నాయకులు రొండి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మాడుగులపల్లి మండల పరిధిలోని అగామోత్కుర్, చిరుమార్థి, పోరెడ్డిగుడెం గ్రామాల్లో ఉన్న నిర్మాణ రంగ కార్మికులు సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మండలంలో ఎక్కువ శాతం నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారని తెలిపారు. వీరికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లేబర్ వెల్ఫేర్ కార్డులు ప్రబుత్వాలే ఫ్రీగా ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న క్లైములు వెంటనే చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో సీఐటీయూ మండల కన్వీనర్ ఖమంపాటి పరుష రాములు, పిల్లల మధు, నక్క సైదులు, లతీఫ్ బాబా, రవి, సైదులు, నాగయ్య, రాజు తదతరులు పాల్గొన్నారు.