Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ మరల స్వర్ణలత చంద్రారెడ్డి
నవతెలంగాణ-ఆత్మకూర్‌ఎస్
వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామాలలో తాగునీటి ఎద్దడి లేకుండా నివారణ చర్యలు చేపట్టాలని ఎంపీపీ మల్ల స్వర్ణలత చంద్రారెడ్డి అన్నారు.సోమవారం మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు.అధికారులు ప్రజాప్రతినిధులకు సమాచారం అందించడం లేదంటూ ప్రజాప్రతినిధులను అగౌరవ పరుస్తున్నారని ఇస్తాలపురం సర్పంచ్ తూడి లావణ్య సభ దృష్టి తీసుకొచ్చారు.అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన భోజనం అందించాలన్నారు.నెమ్మికల్‌లో అంగన్వాడీ కేంద్రంలో గ్యాస్ అయిపోవడం ద్వారా పిల్లలకు భోజనాన్ని అందించలేదంటూ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.పోస్టాఫీసులో వేలిముద్ర వేసిన కానీ డబ్బులు రావడం లేదంటూ సభ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఆయన శాఖల అధికారులు వారి నివేదికలను చదివి వినిపించారు. సచివాలయానికి డాక్టర్ బీఆర్.అంబేద్కర్ పేరును నామకరణం చేసినందుకు, హైదరాబాద్ నడిబొడ్డులో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రి జగదీశ్‌రెడ్డి దత్తత గ్రామం ఏపూర్‌కు జాతీయ అవార్డు లభించినందుకు మంత్రి జగదీశ్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ సభ ఏకగ్రీవతీర్మానం చేసింది.ఈ కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ నేరెళ్ల వెంకన్న,ఎంపీడీఓ మల్సూర్‌నాయక్, తహసీల్దార్ పుష్ప, ఆయాగ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు పాల్గొన్నారు.