Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి,జెడ్పీటీసీ జీడిభిక్షం
- ఆశ్రయం స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
నవతెలంగాణ-సూర్యాపేటరూరల్
మానవ సేవయే మాధవసేవ అని ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి,జెడ్పీటీసీ జీడిభిక్షం అన్నారు.సూర్యాపేట మండలపరిధిలోని రామచంద్రాపురం గ్రామంలో సోమవారం ఆశ్రయం(హ్యాండ్ ఆఫ్ హోప్) స్వచ్ఛంద సంస్థ జయరాజు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని తెలంగాణ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రెవ.ఇరుగుశ్యాంసన్, ప్రధాన కార్యదర్శి బిషప్ దుర్గం ప్రభాకర్ నిర్వహించగా బిషప్ డా సీహెచ్.సాల్మన్‌రాజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు.ఈరోజుల్లో కల్తీ ఆహరం తిని అనేక రకాల వ్యాధులు సంభవించి,ఆర్ధిక స్థోమత లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉచితంగా బీపీ, షుగర్, కంటి పరీక్షలు,కళ్లద్దాలు, దంత పరీక్షలు,వివిధ రకాల జబ్బులను పరీక్షించి, ఎక్సరే స్కానింగ్ చేసి ఒక్క రూపాయి ఖర్చులేకుండా, ఉచితంగా టెస్ట్ లు చేసి మందులివ్వడం గొప్ప సేవాదృక్పథం అన్నారు.సేవాదృక్పథంతో పేద ప్రజలకు ఆశ్రయం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన రాష్ట్ర అధ్యక్షులు ఇరుగు శ్యాంసన్, జయ రాజు ను డాక్టర్స్‌కు ఎంపీపీ, జెడ్పీటీసీ అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల్‌రెడ్డి వెంకట్‌రెడ్డి, తుంగతుర్తి నియోజకవర్గ పాస్టర్స్ అధ్యక్షులు ఆశీర్వాదం, పాస్టర్ పీవీ.బోయాజ్, కదురు సంజీవ్‌కుమార్ పాల్గొన్నారు.