Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి
నవతెలంగాణ - రాజాపేట
రాష్ట్రంలోని సబండ పేద ప్రజల గోస తీర్చిన దేవుడు సీఎం కేసీఆర్ అని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డిఅన్నారు. సోమవారం మండలంలోని మీనాక్షి ఫంక్షన్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడుతూ ప్రతిపక్షాలకు పాలిటిక్స్ ఒక గేమ్ లాగా మారిందన్నారు. కానీ బీఆర్ఎస్కు పాలిటిక్స్ ఒక టాస్క్ అని తెలిపారు. దేశ ప్రజలకు అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందన్నారు. పంటల ఉత్పత్తిలో వృద్ధి సాధించిందని తెలియజేశారు. 2014 ముందు వానాకాలం యాసంగి పంటల ఉత్పత్తిలో సాధించిన దానికంటే పది రెట్ల ఎక్కువ ఉత్పత్తిని తెలంగాణ రాష్ట్రం సాధించిందని తెలిపారు .సంపదలను పెంచాలి పెంచిన సంపదను పేదలకు పెంచాలని కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. బీజేపీప్రభుత్వం పేదలను దోచి ఆదాని, అంబానీలకు దోచిపెడుతుందని విమర్శించారు. ఆలేరు నియోజకవర్గంలో మిషన్ కాకతీయ ద్వారా 530 చెరువులకు మరమ్మత్తులుచేపట్టి గ్రౌండ్ వాటర్‌ను పెంచామని తెలిపారు. 27 చెక్ డ్యాములనుఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీచైర్మెన్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ, యాదాద్రి భువనగిరి ఆత్మీయ సమ్మేళన ఇన్చార్జ్ డాక్టర్ యాదవ రెడ్డి, మదర్ డైరీ డైరెక్టర్లు గాల్ రెడ్డి, వెంకట్రాంరెడ్డి ,రామిరెడ్డి ,మండల పార్టీ అధ్యక్షులు నాగిర్తి రాజిరెడ్డి ,ఎంపీపీ గోపగాని బాలమణి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాస్ రెడ్డి ,రైతు బంధు సమితి అధ్యక్షులు గౌటే లక్ష్మణ్, చైర్మెన్ భాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్ కాకర్ల ఉపేందర్ ,మోత్కుపల్లి ప్రవీణ్ ,బీఆర్ఎస్ ్ట సెక్రటరీ జనరల్ సందుల భాస్కర్ గౌడ్, బిల్ల శీను, పల్లె సంతోష్, మాజీ జెడ్పిటిసి బిక్షపతి, ఆత్మ డివిజన్ చైర్మెన్ వెంకట్ రెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ కాలే సుమలత, గుర్రం నరసింహులు,కటకం స్వామి, జస్వంత్ ,సిద్ధులు ,మోతపల్లి నవీన్ ,బిక్షపతి ,ఎడ్ల బాలలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
పలు అభివృద్ధి కార్యక్రమాల్లో .. ప్రభుత్వ విప్
మండలంలోని రామనాథపురం గ్రామంలో నలభై లక్షల రూపాయలతో సీసీ రోడ్ల పనులకు ప్రభుత్వ విప్పు గొంగిడి సునీత శంకుస్థాపన చేశారు. అదేవిధంగా నాలుగు లక్షల రూపాయలతో నిర్మించిన పీర్ల కొట్టాన్ని ప్రారంభించారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో 40 లక్షల రూపాయలతో రెండు అదనపుగదులకు గ్రామంలో అండర్ డ్రెయినేజీ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గడిపల్లి శ్రవణ్, ఉపసర్పంచి పల్లె ప్రవీణ్, మాజీ సర్పంచ్ నరేందర్, పల్లె సంతోష్ గౌడ్, మహేందర్ ,వెంకటేశం, కటకం స్వామి బాలరాజు పాల్గొన్నారు.