Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -రాజాపేట
రాజంపేట మండలంలోని బొందుగుల గ్రామంలో 1979లో 177 సర్వే నెంబర్లో 15 ఎకరాల భూమిని ఎస్సీలకు ప్రభుత్వం పంపిణీ చేసిందని , భూమిని ధరణి పోర్టల్ రావడం ద్వారా కబ్జాకాలం తొలగిపోవడంతో ఎస్సీలకు అన్యాయం జరిగిందని తెలిపారు .ఎస్సీలకు కేటాయించిన 15 ఎకరాల భూమిని ఇటీవల అదే గ్రామం చెందిన బంధువుల నరేందర్ రెడ్డి సుమతమ్మ బంధువుల కుంతల్ రెడ్డి అనే వ్యక్తులు రోడ్ల వెంకటరామిరెడ్డికి అమ్మడం జరిగింది ఇన్ని రోజులుగా కాస్తు చేసుకొని జీవనం కొనసాగిస్తున్న ఎస్సీలకు అన్యాయం జరిగిందని కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కొల్లూరి ప్రభాకర్ ,ముక్క రవి ,కొండూరు స్వామి, కొమ్ము ప్రకాష్, సరిత,నర్సింలు ,అశోక్ తదితరులు పాల్గొన్నారు.