Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎంహెచ్ఓ కొండల్రావు
నవతెలంగాణ- నల్లగొండ
టీబీబారిన పడిన రోగులకు సేవలందించడం కోసం స్వచ్చంద సంస్థలు ముందుకు రావాలని డిఎంహెచ్ఓ కొండల్రావు కోరారు. కన్వంత ఫౌండేషన్ ఆద్వర్యంలో టిబి (క్షయ) సోకిన మహిళలకు నిక్షరు పోషణ్ యోజన కన్వంత పౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పౌస్టికాహారం కిట్లను పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లా క్షయనివారణ అధికారి డా కళ్యాణ్ చక్రవర్తి అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో డీఎస్పీ నర్సింహారెడ్డి ,ఐఎమ్ఏ నీలగిరి అధ్యక్షురాలు సుచరిత ,కన్వంత పౌండేషన్ చైర్మన్ శ్రీదేవి రెడ్డి డా. జయప్రకాశ్ రెడ్డి, కన్వంతరెడ్డి రమేష్ , రవి ప్రసాద్, దీపా, రూపిక, టిబి సూపర్వైజర్ మిర్యాల సైదులు, జిల్లా పిపిఎమ్ కో-ఆర్డినేటర్ మోత్కురు శ్రీనివాస్ ,సిబ్బంది పాల్గొన్నారు.