Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్డీఓ జయచంద్రా రెడ్డి
నల్లగొండ: వీలైనంత త్వరగా వడ్ల కొనుగోళ్లను పూర్తి చేయాలని ఆర్డీఓ జయచంద్రా రెడ్డి అన్నారు. నల్లగొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో జరుగుతున్న వడ్ల కొనుగోళ్లలో, డివిజన్, రెవెన్యూ , పంచాయితీ రాజ్ సిబ్బంది కి విదుల నిర్వహణ పై శిక్షణ కార్యక్రమం మంగళవారం నల్లగొండ పట్టణం లో గల లయన్స్ క్లబ్ లో నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాదికి సంబంధించిన యాసంగి వడ్ల కొనుగోలను ప్రారంభించినదని, నల్గొండ రెవెన్యూ డివిజన్ యందు మొత్తం 174 ధాన్యం కొనుగోలు కేంద్రాల లో వడ్ల కొనుగోలు ప్రారంభం అయినది అని తెలిపారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని సరైన దరకు అమ్ముకోవడం లో సిబ్బంది పాత్ర ఎంత ప్రాధాన్యత ఉందో సిబ్బంది కి వివరించారు. వడ్ల కొనుగోలు లో గల వివిధ దశల గురించి సిబ్బంది కి తెలియజేశారు.ఓపీఎంఎస్ సైట్ ప్రాధాన్యత, పనితీరు ను వివరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కి సంబందించిన తహశీల్దార్స్, ఎంపిడిఓ లు, రెవెన్యూ, పంచాయతీ రాజ్, వడ్ల కొనుగోలు కేంద్రాల నిర్వాహక సిబ్బంది పాల్గొన్నారు.