Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ
నవతెలంగాణ-నాంపల్లి
ఇందిరా క్రాంతి పథకంలో పనిచేస్తున్న వీఓఏల సమస్యలను పరిష్కరించి, వారిని సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం నాంపల్లి మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు వీఓఏల సమ్మె రెండోరోజుకు చేరుకుంది.సమ్మెకు ఆయన మద్దతిచ్చి మాట్లాడుతూ దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఐకేపీవీఓఏలసమస్యలు పరిష్కరించాలని కోరారు.రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తున్న సమ్మెకు రైతుసంఘం పూర్తిగా మద్దతు తెలిపిందన్నారు.వెంటనే వీఓఏల సమస్యలు పరిష్కరించాలన్నారు.ఆరోగ్యబీమా సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వ గుర్తింపుకార్డులు ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి, వీఓఎల నాయకురాలు ఎస్కె.సైదాభేగం, కోరె అలివేలు, వెంకటమ్మ, నాంపల్లి రోజారాణి, వసుమతి, తదితరులు పాల్గొన్నారు.
మర్రిగూడ:ఐకేపీలో పనిచేస్తున్న వీఓఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ అన్నారు.మండల కేంద్రంలో వీఓఏలు చేపట్టిన నిరవధిక సమ్మె రెండో రోజుకు చేరుకున్న సందర్భంగా వారికి సంఘీభావం తెలిపి మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో సుమారు 18,000 మంది వీవోఏలు గ్రామ సంఘాలకు సహాయకులుగా 19 ఏండ్లుగా చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా పర్మినెంట్ అవుతుందన్న ఆశతో ఎదురుచూశారన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వీఓఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, రూ.10 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం, సెర్ప్ నుండి ఐడి కార్డులు ఇవ్వాలని, అర్హతకలిగిన వివోఏలను సీసీలుగా ప్రమోట్ చేయాలని డిమాండ్ చేశారు.వివో ఏల సమస్యలు పరిష్కారం కాకపోతే సమ్మె ఉధతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పులయాదయ్య, వీవోఏల సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు రంగినేని చంద్రకళ, గంట మంజుల, పానుగంటి పద్మ, అయితగోని గోపాల్, వ్యాసమానస, బుసిరెడ్డి యాదిరెడ్డి, సరిత, వంపు, సుమలత, భాగ్యలక్ష్మి, శోభ, భీమనపల్లి నక్క సిరియాల, తదితరులు, పాల్గొన్నారు
చండూర్ :తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న ఐకెపి వివో ఏ లను సెర్ఫు ఉద్యోగులుగా గుర్తించాలని అప్పటివరకు 26 వేల కనీస వేతనం వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐకెపి వివో ఎల రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మె మంగళవారంరెండో రోజుకు చేరుకుంది. చండూరు మండల కేంద్రంలో జరుగుతున్న సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ లో సుమారు 18 వేల మంది వివోఏలు గ్రామ సంఘాలకు సహాయకులుగా 19 సంవత్సరాల నుండి అనేక కష్టనష్టాలకోర్చి 3900 వేతనంతో పని చేస్తున్నారని అన్నారు. సెర్ఫ్ నుండి ఐడి కార్డులు ఇవ్వాలని, అర్హత కలిగిన వారిని సీసీలుగా నియమించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ మోగదాల వెంకటేశం,తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి జెర్రీ పోతుల ధనుంజయ గౌడ్,, ఆసంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు పి.యాదగిరి ,మానుక ఆహల్య పెండ్యాల లలిత,మిట్టపల్లి అరుణ,లెంకల రాణి, బోయపల్లి అమత, దొంతగాని శశికళ, జక్కలి యాదమ్మ, ఇడెం పుష్ప కుమారి, మాదగోని అరుణ, పాల్వాయి లక్ష్మి, సుగుణ, జెట్టి పద్మ, డోనాల కరుణ, నారపాక నిర్మల,ఎస్ లింగయ్య,, పులిజాల జ్యోతి, కవిత, నేర్లకంటి మోక్షారాణితదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ:ఐకేపీ వీఓఏల సమస్యలను పరిష్కరించాలని సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని ,కనీస వేతనం రూ.26 వేలు నిర్ణయించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నన్నూరి వెంకటరమణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తిప్పర్తి మండల కేంద్రంలోని మండల సమాఖ్య ఆఫీసు ముందు వీఓఏ రెండో రోజు సమ్మెకు రమణారెడ్డి మద్దతిచ్చి మాట్లాడుతూ దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఐకేపీ వీఓఏల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా నిరవాదిక సమ్మె చేస్తున్న సమ్మెకు రైతు సంఘం పూర్తిగా మద్దతు తెలుపుతుందన్నారు. వెంటనే వీవోఏల సమస్యలను పరిష్కరించాలని ఆరోగ్య భీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ భీమగాని గణేష్, నాయకులు అకిటి లింగయ్య ,శరత్, మత్రల మంగమ్మ, వీఓఏ మండల అధ్యక్ష కార్యదర్శులు ఎలుక కోటిరెడ్డి, లెంకల వసంత, అవుట సైదులు, సువర్ణ, సామ్రాజ్యం ,పర్షరాం, జానకమ్మ, రాణి, పుష్ప, లక్ష్మి, రుమాణ,నాగమ్మ, హేమలత, విజయ, సంద్య ,రేణుక, అనిత, అన్నపూర్ణ ,రమణ ,స్రవంతి తదితరులు పాల్గొన్నారు.
నకిరేకల్:ఐకెపి వీఓఏలను ఉద్యోగులుగా గుర్తించాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు ఒంటెపాక వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక మెయిన్ సెంటర్లో వివోఏలు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె రెండవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న వివోఏల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వివోఏల సంఘం మండల అధ్యక్షురాలు జిల్లా లలిత, ఉపాధ్యక్షురాలు ఎం నిర్మల, ప్రధాన కార్యదర్శి వై శ్రీలత, సహాయ కార్యదర్శి కే నవనీత, కోశాధికారి సంధ్య, గౌరవ అధ్యక్షులు గొర్ల యాదగిరి, అరుణ, సంప్రద పాల్గొన్నారు.