Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దామరచర్ల
అన్ని గ్రామాలలోనూ ఉపాధిహామీపనులను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వ్యవసాయ కార్మికసంఘం ఆధ్వర్యంలో దామరచర్ల ఎంపీడీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల కార్యదర్శి వినోద్ మాట్లాడుతూ ఎండలు తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో కూడా రెండు పూటలా పని ,రెండు ఫొటోలు తీయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరిం చుకోవాలని డిమాండ్ చేశారు. పనులు జరిగే చోట కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.ఫలితంగా ఎంతో మంది కూలీలు వడదెబ్బకు గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు.పనులు జరిగే చోట నీడ ,నీరు తోపాటు ఓఅరెస్ పాకెట్స్ అందుబాటులో ఉంచాలని కోరారు.200 ల రోజుల పని దినాలు కల్పించాలని కోరారు. పెండింగ్ వేతనాలు మంజూరు చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సైదులు ,సిఐటియు మండల కార్యదర్శి దాయానంద్ తదితరులు పాల్గొన్నారు.