Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నవ తెలంగాణ-నార్కట్ పల్లి
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో మతాలకతీతంగా పండుగలు జరుగుతున్నాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు.నార్కట్ పల్లి పట్టణ కేంద్రంలో రంజాన్ మాసం సందర్బంగా పేద ముస్లింలకు ప్రభుత్వం సరఫరా చేసిన దుస్తులను మంగళవారం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అందజేశారు అనంతరం నార్కట్ పల్లి మండలానికి చెందిన 9 మంది లబ్ధిదారులకు మంజూరైన షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే చిరుమర్తి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మత విద్వేషాలకు పాల్పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథలయ సంస్థ చైర్మన్ రేగట్టే మల్లికార్జున్ రెడ్డి ఎంపీపీ సూది రెడ్డి నరేందర్ రెడ్డి తాసిల్దార్ పులి సైదులు స్థానిక సర్పంచ్ దూదిమెట్ల స్రవంతి, కో ఆప్షన్ సభ్యులు ఎండి వాజిద్ అలీ, వార్డు సభ్యులు ఎండి అజీజ్, గిర్దావర్ వరుణ్, పాల్గొన్నారు.