Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ ఎన్ని ట్రిక్స్ చేసినా బీఆర్ఎస్దే హ్యాట్రిక్
- బీఆర్ఎస్వి పథకాలు, పనులు అయితే బీజేపీవి పన్నాగాలు, కుట్రలు
- మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-చౌటుప్పల్
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్కు తొలి విజయం సిద్దిపేట అని, బీఆర్ఎస్కు తొలి విజయం మునుగోడులో లభించిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని లక్కారంలోని ఎస్ఎంఆర్ ఫంక్షన్హాల్లో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ మండల ఆత్మీయ సమ్మేళనంలో ఆయనతోపాటు రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ నాయకులు ప్రజలకు ఎంత డబ్బు ఆశ చూపినా మునుగోడు అభివృద్ధి కోసం బీఆర్ఎస్ను గెలిపించారన్నారు. ప్రజలను ఎన్నిసార్లు అభినందించినా తక్కువేనన్నారు. ప్రజా అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. అందుకే చౌటుప్పల్‌కు వంద పడకల ఆసుపత్రి వచ్చిందన్నారు. నిజం కూడా ప్రచారంలో ఉండాలని, లేదంటే అబద్దం ప్రచారమవుతుందని, రాష్ట్రాన్ని, దేశాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని అంబేద్కర్ చెప్పారన్నారు. కాంగ్రెస్‌పార్టీ, బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రమైనా తెలంగాణతో పోటీ పడగలదా అని ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్న పథకాలు ఇతర రాష్ట్రాల్లో లేవన్నారు. డబుల్ ఇంజన్ మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు ఉన్నాయా అని అన్నారు. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో రైతుబంధు, రైతుభీమా, కల్యాణలక్ష్మీ పథకాలు ఎందుకు రాలేదన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి జానారెడ్డి, ఆ బ్రదర్స్ ఇక్కడే ఉన్నారు, మెడికల్ కాలేజీలు, బత్తాయి మార్కెట్, నిమ్మకాయ మార్కెట్ ఎందుకు తేలేదన్నారు. బీజేపీ నాయకులు పదో తరగతి పేపర్ లీకేజీ చేసి విద్యార్థుల జీవితాలతో కూడా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వానిది పథకాలు, పనులు అయితే బీజేపీవి కుట్రలు, పన్నాగాలు అన్నారు. బీజేపీ ఎన్ని ట్రిక్స్ చేసినా రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలది గన్ కల్చర్ అయితే తెలంగాణది అగ్రికల్చర్ అన్నారు. రైతు సంపదను పెంచిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులు ఎరువుల కోసం మళ్లీ క్యూ లైన్లలో నిలబడాల్సి వస్తుందన్నారు. వైద్యరంగంలో తెలంగాణ ఎన్నో అద్భుతాలు సాధిస్తుందన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎండాకాలం వస్తే కరెంట్ కోతలు ఉండేవన్నారు. డబుల్ ఇంజన్ రాష్ట్రంలో రూ.600 పింఛన్ ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.2016 పింఛన్ ఇస్తుందన్నారు. యావద్దేశ ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నారని తెలిపారు. 2014-15 సంవత్సరం 3392 కోట్ల రూపాయల ధాన్యం సేకరిస్తే 2020-21 నాటికి 26,600 కోట్లకు చేరుకుందన్నారు. కేసీఆర్ కల్యాణలక్ష్మీ పథకం పది లక్షల 50వేల మంది లబ్ది పొందారన్నారు. వడ్డీ లేని రుణాలు, ఒంటరి మహిళలకు ఆసరా పింఛన్లు ఇస్తున్నామన్నారు.
రాష్ట్ర విద్యుత్తుశాఖ గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండలో 12కు 12 అసెంబ్లీ స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకొని చరిత్ర సృష్టించిందన్నారు. సీఎం కేసీఆర్ వల్లే రైతన్నలు సంతోషంగా ఉంటున్నారని తెలిపారు. నాడు అన్నమే లేని జిల్లా నేడు దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందన్నారు. 45 లక్షల మెట్రిక్ టన్నుల వరిపంట పండించి దేశానికి అన్నం పెడుతుందన్నారు. సీఎం కేసీఆర్ వల్లే ప్రతి ఎకరాకు సాగునీరు అందించి దేశంలో అత్యధిక వరి పండిస్తున్నామని తెలిపారు. మునుగోడు ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారన్నారు. రాష్ట్రంలో ప్రజల దగ్గరకు వెళ్లి ఓట్లు అడిగే హక్కు కేవలం బీఆర్ఎస్ పార్టీకే ఉందన్నారు.బీజేపీ దుర్మార్గలను నల్లగొండ అంచుకు కూడా రానివ్వబోమన్నారు. ఉమ్మడి నల్లగొండలో 12కు 12 అసెంబ్లీ స్థానాల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జెడ్పీచైర్మెన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు దేవిప్రసాద్, వెన్నెపల్లి వెంకటేశ్వర్రావు, చండూరు ఎంపీపీ పల్లె కల్యాణిరవికుమార్గౌడ్, మున్సిపల్, సింగిల్‌విండో చైర్మెన్లు వెన్‌రెడ్డి రాజు, చింతల దామోదర్‌రెడ్డి, నారాయణపురం జడ్పీటీసీ వీరమల్ల భానుమతివెంకటేశ్గౌడ్, బీఆర్ఎస్ మున్సిపల్, మండల అధ్యక్షులు ముత్యాల ప్రభాకర్‌రెడ్డి, గిరికటి నిరంజన్‌గౌడ్, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.