Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోద శ్రీరాములు
- గుట్టలో సీపీఐ మోటార్ సైకిల్ యాత్ర ప్రారంభం
నవతెలంగాణ -యాదగిరి గుట్ట
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించాయని సీపీఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు అన్నారు. మంగళవారం ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని మంగళవారం పట్టణంలో అమరజీవి కామ్రేడ్ గోద యాదగిరి స్మారక స్థూపం నుండి మోటార్ సైకిల్ యాత్రను ప్రారంభించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫాసిస్ట్ తరహా పాలను అవలంబిస్తూ దేశంలో రాజకీయ ,సామాజిక స్వేచ్ఛ ,పౌర హక్కులను కాలరాస్తూ లౌకిక వ్యవస్థను ధ్వంసం చేసే విధంగా వ్యవహరిస్తు న్నారని విమర్శించారు.దేశ జాతీయ సంపదను గుజరాతి కార్పొరేట్లకు అప్పగించే ప్రయత్నంలో ప్రైవేటీకరణకు పాల్పడుతున్నారన్నారు. అందుకే జాతీయ పార్టీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి 14 ఏప్రిల్ నుండి మే 14 వరకు దేశవ్యాప్తంగా కార్యక్రమానికి పిలుపునిచ్చిం దన్నారు. దేశంలో బిజెపి కో అటావో దేశ్ కో బచావో అనే నినాదంతో సిపిఐ యాత్ర కొనసాగుతుందని తెలిపారు.. రాష్ట్రంలో కెసిఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని నేటికీ డబుల్ బెడ్రూం ఇండ్లు,అర్హులకు రేషన్ కార్డులు ,పెన్షన్లు ,దళితులకు మూడెకరాలు ,నిరుద్యోగ భృతి ఊసే లేదన్నారు. ఈ రెండు ప్రభుత్వాలు అధికార దాహంతో తప్ప ప్రజా పరిపాలన యోగం కోసం పనిచేయడం లేదని విమర్శించారు. అందుకే ఇంటింటికి సీపీఐ కార్యక్రమం చేపట్టి ప్రజలను చైతన్యం చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, బండి జంగమ్మ, చెక్క వెంకటేష్, ఏషాల అశోక్ ,ఉప్పల ముత్యాలు, సిపిఐ జిల్లా సమితి సభ్యులు బబ్బూరి శ్రీధర్ ,మండల కార్యదర్శి జిల్లా జానకిరాములు సహాయ కార్యదర్శిలు పేరబోయిన మహేందర్, కల్లపల్లి మహేందర్, మున్సిపల్ కౌన్సిలర్ దండబోయిన అనిల్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు పేరబోయిన పెంటయ్య మండల కార్యవర్గ సభ్యులు బబ్బూరి నాగయ్య పేరబోయిన బంగారి, రాయగిరి బాలకిషన్, అరే పుష్ప, మునుగుంట్ల నరసమ్మ, గోపగాని రాజు, మాటూరు మల్లయ్య, హేమలత, సబిత,రాజు,ముఖ్యర్ల పెంటయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.