Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హమాలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు భూడిద భిక్షం
నవతెలంగాణ- రామన్నపేట
వడ్ల కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి, దాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని హమాలీ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు భూడిద భిక్షం ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం మండలంలోని ఎన్నారం, సూరారం, బాచుప్పల గ్రామాల్లో సిఐటియు హమాలి సంఘం ఆద్వర్యంలో దాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి, హమాలీ కార్మికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వరి కోతలు ప్రారంభమై 20రోజులు గడుస్తున్నా ఇప్పటికీ కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. వీరితో పాటు హమాలీ కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో మంచినీరు, టెంట్లు వంటి కనీస సధుపాయాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో హమాలీ యూనియన్ మండల అధ్యక్షులు దండిగ అంజయ్య, కంబాలపల్లి రాములు, గన్నెబోయిన మురళి, జినుకల మల్లేష్, సంకబుడ్డి మల్లయ్య, రైతు దోమల గంగయ్య, జినుకల నాగరాజు, దాసరి నర్సింహ తదితరులు పాల్గొన్నారు.