Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీలో పలువురు చేరిక
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు
నవతెలంగాణ -బొమ్మలరామారం
ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే వారోత్సవాలను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పాండు అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం వారి చేతిలో పదిమంది మీదుగా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం లక్ష్మయ్య అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా దాసరి పాండు మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న సీపీఐ(ఎం) చూసి పార్టీలో చేరుతున్నారని, పార్టీ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం దేశంలో ఉన్న ప్రజలు ప్రజలన్ను, కుల ,మత ప్రాంతాల పేరుతో విచ్చిన్నం చేస్తూ దేశ స్వావలంబన ఆర్థిక విధానాలను నిర్వీర్యం చేస్తూ దేశంలో పెట్టుబడిదారులక్ను, కార్పొరేట్ శక్తులకు రాయితీలు కల్పిస్తూ దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కార్చావు గా అమ్మేస్తున్నదన్నారు.ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ర్యకల శ్రీశైలం, ఎల్లయ్య ,పున్నమ్మ ,ఉప్పలయ్య ,ముక్కెర్ల బానరసింంహ, ముత్యాల భాస్కర్,నవీన్,స్వరూప తదితరులు పాల్గొన్నారు.