Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్
దేశ అభివద్ధిలో కార్మికుల కర్షకుల శ్రమశక్తి వెలగట్టలేనిదని వారి శ్రమ వల్ల దేశంలో ఎన్నో అద్భుతమైన కట్టడాలను నిర్మించుకొన్నామని, ఆహార ధాన్యాల కొరత తీర్చుకుంటున్నామని ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి బాదే నరసయ్య అన్నారు. బుధవారం కార్మికుల శ్రమశక్తి అనే పాటను హుజూర్నగర్లో చిత్రీకరిస్తున్న సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ దేశమైనా అభివద్ధి సాధించాలంటే పరిశ్రమలు నెలకొల్పడంతో పాటు కార్మిక శక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్మికుల కష్టపలి తంగానే ప్రపంచంలోనే మానవ శ్రమతో నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్టు నాగార్జునసాగర్ డ్యాంతోపాటు ఆనకట్టలు చెరువులు నిర్మించిన ఘనత కార్మికులకే దక్కిందన్నారు. నేడు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ సంపదను బడా బాబులకు దోచిపెడుతూ కార్మికులకు నష్టం కలిగించే అనేక జీవోలు తీసుకొచ్చిందని వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీతారాములు, శ్రీను, కుమారి, సైదమ్మ , రమణ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.