Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధాన్యాన్ని దిగుమతి చేసుకోకపోతే మిల్లులను సీజ్ చేస్తాం
- అదనపు కలెక్టర్ భాస్కర్రావు
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఐకేపీ పీఏసీఎస్ ధాన్యాన్ని మిల్లర్లు ఎప్పటికప్పుడు దిగుమతి చేసుకోవాలని, దిగుమతి చేసుకోవడంలో ఇబ్బందులకు గురి చేస్తే మిల్లులను సీజ్ చేస్తామని జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్రావు హెచ్చరించారు. బుధవారం నవతెలంగాణలో 'రైతుల కష్టాలు తీరేనా..' అనే కథనానికి స్పందించిన ఆయన బుధవారం వేములపల్లి మండలంలోని శెట్టిపాలెంలో కామదేను కనకమహాలక్ష్మి రైస్ మిల్లులను, ఐకెేపీ కేంద్రాన్ని డీఎస్ఓ వెంకటేశ్వర్లతో కలిసి తనిఖీ చేశారు. మిల్లుల వద్ద ఆగి ఉన్న లారీలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైస్ మిల్లు మిల్లర్లతో సమావేశం జరిపి ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని సీఎంఆర్ కోసం మిల్లులకు ధాన్యాన్ని పంపిస్తున్నామని, మిల్లర్లు ఎట్టి పరిస్థితుల్లో ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలన్నారు. దిగుమతి చేసుకోవడంలో అలసత్యం వహించిన ఇబ్బందులు గురిచేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేంద్రాల వద్ద ఎగుమతి చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లర్లు మిల్ పాయింట్ వద్దనే దిగుమతి చేసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యాన్ని రైతులు తీసుకురావాలని సూచించారు. ధాన్యం 17శాతంలోపు తేమ శాతం ఉండేవిధంగా చూసుకోవాలన్నారు. ధాన్యంలో తేమ, పొట్టు, రాళ్లుఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నాణ్యమైన దాన్ని మాత్రమే మిల్లర్లు తీసుకుంటారని వాటిని మిల్లింగ్ చేయడం వల్ల తిరిగి పేదలకు పంపిణీ చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. రైతులు ధాన్యం నాణ్యత విషయంలో నిబంధనలను పాటించాలని సూచించారు ధాన్యం అమ్మిన వెంటనే బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్, కార్యదర్శి భోగవేల్లి వెంకటరమణ చౌదరి, సివిల్ సప్లై డీటీ రామకష్ణారెడ్డి, ఆర్ఐ సురేందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.