Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాగు నీటి ఎద్దడి లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలి
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
సాధించుకున్న తెలంగాణలో నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులకు 8ఎండ్లలో 16సార్లు నీటిని అందించుకొని చరిత్ర తిరగరాసినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా 14సార్లు ఆయకట్టుకు రైతులకు సాగు నీరు అందించని ఘనత ఉండగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాడ్డాక 16సార్లు అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అని అభివర్ణించారు.బుధవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ చైర్పర్సన్ గుజ్జా దీపికా అధ్యక్షతన జిల్లా పరిషత్ మంత్రి, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే గాదరి కిషోర్, హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుండి ఆంధ్రాకు నీటిని తరలిస్తున్న పట్టించుకునే వారే లేరన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక ప్రభుత్వం నాగార్జున సాగర్ నీటిని ఆంధ్రాకు తరలించకుండా నిలువరించడంతో సూర్యాపేట జిల్లాలో ప్రస్తుతం ఆయకట్టు 6లక్షల ఎకరాలకు చేరిందన్నారు. వేసవినేపథ్యంలో రానున్న రెండు నెలలు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.నూతన్‌కల్ మండలం చిల్పకుంట గ్రిడ్‌లో మోటర్లు తరచూ రిపేర్లు వస్తున్నాయని ఎమ్మెల్యే గాదరికిశోర్‌కుమార్ మంత్రి దష్టికి తీసుకరావడంతో సంబంధిత కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాకు మెడికల్ కాలేజీ రావడంతో హైదరాబాద్‌లో అందించే కార్పొరేట్ సేవలు సూర్యాపేటలో అందుతున్నాయని మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధర్‌రెడ్డిని అభినందించారు.హుజూర్‌నగర్‌కు చెందిన వ్యక్తికి గుండెపోటు రావడంతో ప్రభుత్వాస్పత్రి సిబ్బంది చికిత్స అందించి బతికించారని గుర్తు చేశారు.అదేవిధంగా బ్రెయిన్ సంబంధిత వ్యాదితో బాధపడుతున్న వ్యక్తికి చికిత్స అందించి రోగిని మామూలు స్థితికి తీసుకొచ్చినట్లు తెలిపారు. రాజ్యసభసభ్యులు బడుగుల లింగయ్యయాదవ్ మాట్లాడుతూ గడ్డిపల్లి సాగర్ కాలువపై బ్రిడ్జి నిర్మాణానికి నిడమనూరు, నాగార్జున సాగర్ 14వ మైల్ రాయి వద్ద ఉన్న వంతెన నమూనాను పరిశీలించి అదే తరహాలో నిర్మించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ పధకాలు ప్రజలకు చేరేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎమ్మెల్యే గాదరికిశోర్‌కుమార్ మాట్లాడుతూ రెండో విడత గొర్రెల పంపిణీ కోసం గతంలో ఆన్లైన్లో నమోదు కానీ యాదవులను వెంటనే ఆన్ లైన్లో నమోదు అయ్యేలా చర్యలు చేపట్టాలని పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు.నాడు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న ప్రస్తుత మంత్రి జగదీశ్‌రెడ్డి దళిత శాసనసభ్యులతో కలిసి చర్చించి హైదరాబాద్‌లో 125 అడుగుల విగ్రహ ఆవిష్కరణ చేయాలన్న నిర్ణయంతో ముఖ్యమంత్రి కేేసీఆర్‌తో చర్చించి మొదటగా అడుగులు వేశారని వివరించారు.ప్రపంచంలో ఎక్కువగా డాక్టర్ అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయని, విగ్రహంతో పాటు అన్ని సంక్షేమ శాఖల గురుకులాలు ఏర్పాటు చేయాలనే గొప్ప ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యికి పైగా గురుకులాలు ఏర్పాటు చేశారనని తెలిపారు.ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ హుజూర్నగర్ నియోజకవర్గంలో అమరారం, గుర్రంబొడు లిఫ్టులు పని చేయకున్న నిరంతరం కాలువల ద్వారా సాగునీరు అందించి అధికారులు కషి చేశారన్నారు.గతంలో కరెంట్ సమస్యతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితుల నుండి నేడు తెలంగాణలో అత్యధిక డిమాండ్ కరెంట్ ఇస్తున్నారని పేర్కొన్నారు.కలెక్టర్ ఎస్.వెంకట్రావు మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల ద్వారా గిరిజన గ్రామ పంచాయతీలలో భవనాల నిర్మాణం చేపడ్తామన్నారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇరిగేషన్ కాలువల వెంబడి, ఇరిగేషన్ ట్యాంకుల పక్కన మొక్కలు నాటాలని సూచించినందున జిల్లా వ్యాప్తంగా 3.50లక్షల మొక్కలను నాటేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించాలని నీటి పారుదల, రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. వారం రోజులలోపు హరితహారంపై ప్రత్యేక జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి ప్రణాళికలు సిద్ధం చేఆస్తామన్నారు.నర్సరీలలో మొక్కలు ఇప్పటికే సిద్ధంగా ఉంచామన్నారు.ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలతో హరితహారాన్ని విజయవంతం చేయాలని కోరారు.
రెండు తీర్మానాలు ఆమోదం
జాతీయస్థాయిలో దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ మహిళా స్నేహపూర్వక అవార్డుతో పాటు రూ.కోటి నగదు పొందిన సూర్యాపేట జిల్లాకు చెందిన ఆత్మకూర్(ఎస్) మండలం ఏపూరు గ్రామం దేశంలోనే పేరు ప్రఖ్యాతలు సాధించినందుకు అభినందనలు తెలుపుతూ తీర్మానాన్ని జెడ్పీ చైర్పర్సన్ గుజ్జా దీపికా ప్రవేశపెట్టగా జెడ్పీ వైస్‌చైర్మెన్ వెంకటనారాయణగౌడ్ ఆమోదం తెలిపారు.అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ప్రపంచంలో మరెక్కడా లేని విదంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హైదరాబాద్‌లోని సచివాలయం పక్కన 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని జాతికి అంకితం చేయడంతో పాటు సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టినందుకు ధన్యవాద తీర్మానం తెలుపుతూ చైర్పర్సన్ ప్రవేశ పెట్టగా తుంగతుర్తి శాసన సభ్యులు గాదరి కిశోర్‌తో పాటు సూర్యాపేట జెడ్పీటీసీ జీడిభిక్షం తీర్మానాన్ని బలపరిచారు.జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా గిరిజానాభివద్ధిశాఖ, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, జిల్లా పశు సంవర్ధక శాఖ, మిషన్ భగీరథ, నీటి పారుదల, ఆయకట్టు అభివద్ది శాఖ, విద్యుత్ శాఖ, ఎస్సీ అభివద్ధి శాఖ, జిల్లా మత్స్య సంవర్ధక శాఖతో పాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలపై సుదీర్గంగా చర్చించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎస్.మోహన్‌రావు, జెడ్పీ సీఈఓ సురేశ్, ఎంపీపీలు,జెడ్పీటీసీలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.