Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంజాన్ మాసంలో మంత్రి జగదీశ్‌రెడ్డి మార్క్
- సొంత నిధులతో ఏడు వేలకు పైగా ముస్లిం కుటుంబాలకు తోఫా పంపిణీ
- సీఎం కేసీఆర్ స్ఫూర్తితో ఈ కార్యక్రమం
- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
రంజాన్ పండుగ పర్వదినోత్సావాన్ని పురస్కరించుకుని సూర్యాపేట నియోజకవర్గంలో ఏడు వేల మందికి పైగా ముస్లిం కుటుంబాలకు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీవ్రెడ్డి రంజాన్ తోఫా ను బుధవారం ఇంటింటికీ పంపిణీ చేశారు.దాదాపుగా కోటి రూపాయలు సొంత నిధులతో ఏడు వేలకు పైగా ముస్లిం కుటుంబాలకు బాస్మతి బియ్యం, డ్రై ఫ్రూట్స్‌తో సహా పది రకాల నిత్యావసర సరుకులు ప్రతి ముస్లిం కుటుంబానికి స్వయంగా మంత్రి అందజేశారు.గత రెండు దఫాలుగా సూర్యపేట నియోజకవర్గ పరిధిలో మొదలు పెట్టిన ఈ కార్యక్రమం ఈ సంవత్సరం కూడా మూడవ సారి రంజాన్ తోఫా కు మంత్రి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం ఆసాంతం ముస్లిం సోదరులకు మనోధైర్యాన్ని పెంపొందించేలా చేసింది. చంద్రామానాన్ని అనుసరించి 9 వ నెలలో ముస్లింలు జరుపుకునే పరమ పవిత్ర మైన రంజాన్ పండుగ రావడం తో ఆర్థిక వెసులుబాటు ఎలా అన్న సందిగ్ధంలో ఉన్న పేద ముస్లిములకు మంత్రి అందించిన రంజాన్ తోఫా ఆసరాగా నిలిచింది.దివ్యఖురాన్ గ్రంధం ఆవిర్భవించిన మాసం లో క్రమశిక్షణ... దాత్రుత్వం... ధార్మిక చింతనల కలయిక తో ఏర్పడ్డ రంజాన్ పరవదినోత్సం రోజున ఏ ఒక్క ముస్లిం సోదరుడు నిరాశకు లోను కావద్దన్న సంకల్పంతో మంత్రి ఆలోచనలకు ఈ తోఫా కార్యక్రమం ప్రతిబింబించింది. మంత్రి నేరుగా గుమ్మం ముందటకు వచ్చి తోఫాను అందజేయ్యడం పట్ల పేద ముస్లిం సోదరులు ఆనందంతో పరవశించి పోతున్నారు. మంత్రి ఇంటింటికి తిరిగి డ్రై ఫ్రూట్స్ తో సహా 10 రకాల నిత్యావసర సరుకులు ఉన్న బ్యాగ్ అందజేతతో పండుగ వాతావరణం ప్రారంభమైనట్లుగా ముస్లిములు భావిస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం నిధులతో సంబంధం లేకుండా సొంత నిధులతో పట్టణంలో పలు మజీద్ లను క్లబ్ చేస్తూ ఉపవాస దీక్షకుల కోసం ఏడూ ప్రాంతాల్లో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేశారు. ఇది గాక ఇటీవలే ఇంటింటికి తిరుగుతూ షాది ముబారక్ చెక్కులను మంత్రి అందజేసిన విషయం తెల్సిందే. ఆసందర్భంగా ముస్లిం కుటుంబాలు మంత్రిని ఆప్యాయంగా పలకరించి వారి సాంప్రదాయ పద్ధతిలో చేతికి దట్టి కట్టి, నెత్తిపై టోపీ పెట్టి, భుజాన రుమాలు వేసి సుగంధ ద్రవ్యాలతో,శాలువాలతో సన్మానించారు.సేమ్యాల ఖీర్, స్వీట్లు తినిపించి ఆప్యాయతను చాటుకున్నారు.ఇదిగాక రూ.రెండు కోట్లతో పట్టణంలో షాదీఖాన నిర్మాణం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.రూ.60 లక్షలతో ఈద్గాలో సజ్దా ప్లాటు ఫార్మ్ నిర్మించారు. అలాగే 450 ఏండ్ల చరిత్ర గల పెద్ద మసీదును యాభై లక్షల రూపాలతో నూతనంగా నిర్మించడంతో పాటు మిగతా పనులు పూర్తి కోసం ఇటీవలే మరో 50 లక్షల రూపాయల నిధులను మంత్రి మంజూరు చేయించారు.నలభై రెండు గ్రామాలలో ఖబ్రస్తాన్‌లలో ప్రహరీ, మరమ్మతులకు రూ.3 కోట్లు మంజూరు చేయించారు.సుర్యాపేట ఖబరస్థాన్‌లో రూ.30 లక్షలతో అభివద్ధి పనులు చేయిస్తూన్నారని ఇప్పటికే మెజార్టీ పనులు పూర్తయ్యాయని మైనార్టీ నాయకులు అంటున్నారు. కాసారాబాద్ రోడ్ వద్ద ఐదెకరాలస్థలాన్ని ఖబరస్థాన్ కోసం మంజూరు చేయించి రూ.50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్నారు.చనిపోయిన వారికోసం మూడు ఫీజర్బాక్సులు, పార్థివదేహాన్ని ఖబరస్థాన్‌కు తీసుకెళ్లడం కోసం ప్రత్యక వాహనం ఏర్పాటు చేయించారు.అలాగే రోడ్డు ప్రమాదం జరిగిన వారికి, అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసీలు ఇప్పించి వారికి వైద్య సహాయం అందే విధంగా మంత్రి కషి చేస్తున్న విషయం తెల్సిందే.
తెలంగాణ గంగా, జమునా తహజీబ్... మంత్రి జగదీశ్‌రెడ్డి
మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ ఆంగ్లేయుల పాలనలో సైతం అప్పటి హైదరాబాద్ రాష్ట్రం సర్వమత సమ్మేళనానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.జాతిపిత మహాత్మాగాంధీ సైతం ఈ విషయాన్ని అంగీకరించారని తెలిపారు.అటువంటి రాష్ట్రంలో మతసామరస్యాన్ని కాపాడడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అందే వేసిన చెయ్యి అని ఆయన కొనియాడారు.చంద్రమాన క్యాలెండర్‌ను అనుసరించే ఇస్లామీయ క్యాలండర్ తొమ్మిదవనెలలో రంజాన్మాసాన్ని పరమపవిత్రమైన మాసంగా జరుపుకుంటారన్నారు.అందుకు ప్రధాన కారణం ఇదే మాసంలో దివ్య ఖురాన్ గ్రంధం అవిర్భవించడమేనని ఆయన పేర్కొన్నారు. క్రమ శిక్షణ.... దాత్రుత్వం... ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసమని ఆటువంటి పవిత్రమైన మాసంలో సంభవించిన పరిణామాలతో రంజాన్ పరవదినోత్సవ ప్రాశస్త్యాన్ని కాపాడుకోవడం తో పాటు... ఏ ఒక్కరు ఆర్ధికంగా కుంగి పోకుండా ఉండేందుకు గాను తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల స్ఫూర్తితోటే రంజాన్ పర్వదినోత్సం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు.