Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓదార్చిన బీర్ల అయిలయ్య
యాదగిరిగుట్టరూరల్: యాదగిరిగుట్ట మండలం లప్ప నాయక్ తండ గ్రామం బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో ముంపునకు గురైంది.ఈ సందర్భంగా వారికి రావాల్సిన డబ్బులు, ఆర్అండ్ఆర్ ప్యాకేజి కోసం బస్వాపూర్ రిజర్వాయర్ కట్ట పైన సుమారు 35రోజులుగా నిరసన దీక్ష చేస్తున్నారు. గురువారం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బీర్ల అయిలయ్య వారికి సంఘీభావం తెలిపారు. వారి కన్నీటి పర్యంతమైతే వారికి ధైర్యం ఇచ్చారు. మీకు రావాల్సిన డబ్బులు ప్యాకేజీ వచ్చేంతవరకు నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పోరాటం చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింపజేసి, ఇండ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉత్తర్వులిచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా అమలు చేయడం లేదని తండా వాసుల పరిస్థితి చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తర్వుల్లో పేర్కొన్న విధంగా దాతరుపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 294లో ఇళ్ల స్థలాలు కేటాయించి, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ఒక్కో ఫ్యామిలీ కి రూ.7.61 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చీర శ్రీశైలం, మండల పార్టీ అధ్యక్షుడు కానుగు బాలరాజు గౌడ్, సర్పంచ్ బుజ్జి శంకర్ నాయక్, ఇంజ నరేష్, గుడ్ల నరేష్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.