Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి,ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపిలో చేరడంతో మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ జ్యోష్ పెరిగింది. కానీ పాత కొత్త కార్యకర్తలను, నాయకులను కలుపుకొని ముందుకు పోవడములో రాజగోపాల్ రెడ్డి పూర్తిగా విఫలం చెందినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. మునుగోడులో జరిగిన ప్రతి ఎన్నికల్లో మూడో స్థానంలో ఉండే బీజెపీ ఓటు బ్యాంకును ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో రెండో స్థానంలోకి తీసుకు వచ్చి తన చరిష్మా చాటుకున్నారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ మారే వ్యవహారం నుండి మొదలుకుని కాంట్రాక్టులు దక్కించుకునే వరకు బిజెపి జాతీయ నాయకులతో లాబియింగ్ నడపడం వల్ల రాష్ట్ర నాయకత్వముతో తత్ సంబంధాలు కొనసాగించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అప్పటి వరకు మునుగోడు ఇంచార్జి గా ఉన్న గంగిడి మనోహర్ రెడ్డి సైతం ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి కి ప్రచారం చేయకపోవడం ఇదో కారణమని చర్చించుకుంటున్నారు.ఉప ఎన్నికల్లో తనతోపాటు పార్టీ మారి వచ్చిన వారికి మాత్రమే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పాత బీజేపీ నాయకులు కార్యకర్తలు అప్పట్లోనే అధిష్టానానికి మొర పెట్టుకున్నట్టు ప్రచారం జరిగింది.కలుపుకు పోయినా పొకపోయినా పార్టీ కోసం పని చేయాలని చెప్పడంతో సర్ధుకపోయింట్టు తెలిసింది.ఎన్నికల అనంతరం సైతం ఆయనలో మారుపు రాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉప ఎన్నికల తరువాత ఎక్కడైనా సమావేశం నిర్వహించి అందరు కలిసి పని చేయాలని చెప్పిన దాఖలాలు లేవని సొంత పార్టీ కార్యకర్తలే విమర్శిస్తున్నారు.
.సాధారణ ఎన్నికల్లో పోటీ చేసేనా!
వచ్చే సాధారణ ఎన్నికల్లో తిరిగి ఎమ్మెల్యే గా పోటీ చేస్తారా!లేదా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని,మరోసారి పోటీ చేయనని ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోండడంతో పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.రాజగోపాల్ రెడ్డి కాకుండా గంగిడి మనోహర్ రెడ్డి గానీ మరో ఒకరో పోటీలో ఉంటే ఆయన తో పాటు పార్టీ మారిన వారు బీజేపికి ఓటు వేస్తారో లేదోననే చర్చ జరుగుతుంది.
ఎంపీగా పోటీ చేయొచ్చు
రాజగోపాల్ రెడ్డి వచ్చే ఎన్నికలలో భువనగిరి ఎంపీగా పోటీ చేస్తారని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయించకుండా భువనరిరి ఎంపీగా పోటీ చేయించాలని పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. గతంలో ఎంపీగా గెలుపొందిన రాజగోపాల్ రెడ్డి ఎంపీ గా పోటీ చేయడం ద్వారా పార్లమెంటు నియోజక వర్గం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో తన చరిష్మాను ఉపయోగించి ఎమ్మెల్యే లను గెలిపిస్తారని జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.అందుకు రాజగోపాల్ రెడ్డి సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తుంది. మారో సారి బీజేపీ అధికారం లోకి వేస్తే కేంద్రంలో మంత్రి పదవి దక్కుతుందని ఆయన అనుచరులు భావిస్తున్నారు.