Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎస్పీ విచారణ, యజమానిపై కేసు నమోదు
నవతెలంగాణ- భూదాన్ పోచంపల్లి
ఇటుక బట్టీల కార్మికులను మహిళలని చూడకుండా యజమాని విపరీతంగా కొట్టడంతో వారు వీడియోలు తీసి ఒరిస్సా రాష్ట్రంలో లేబర్ ఆఫీస్ పంపియడంతో అక్కడి అధికారులు రాష్ట్ర అధికారులకు సమాచారం ఇవ్వడంతో లేబర్ఆఫీస్ అధికారులు, నల్గొండ డీస్పీ వెర్నా ,భూదాన్ పోచంపల్లి పోలీసులు గురువారం పురపాలక కేంద్రం నారాయణగిరి పివీఎస్ ఇటుకల బట్టీల చేస్తున్న కార్మికులను అడిగి తెలుసుకున్నారు. గత నాలుగు నెలల క్రితం ఒరిస్సా రాష్ట్రం కనిగిరి జిల్లా నుండి వలస కార్మికులను పనిలో కుదిరించుకున్నారు.ఇటుక బట్టీలలో పనిచేస్తున్న వలస కార్మికుల పని భారం ఎక్కువ కావడంతో కార్మికులు వెళ్లిపోవడానికి ప్రయత్నించగా విషయాన్ని గమనించిన బట్టీల యజమాని గమనించి మంగళవారం ఆరుగురిని పురుషులు, మహిళలని చూడకుండా ఇష్టమొచ్చినట్టు విపరీతంగా కొట్టడంతో త్రీవ అస్తవ్యవస్థకు గుయ్యారు. ఈ ఘటనకు సబంధించిన కార్మికులు వీడియోలు తీసి తమ రాష్ట్రానికి లేబర్ ఆఫీస్ పంపియడంతో అక్కడ అధికారులు అప్రమత్తమై రాష్ట్ర అధికారులకు సమాచారం ఇచ్చారు. నల్గొండ డీఎస్పీి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేశారు. వలస కార్మికులకు కనీస వసతులు కల్పించి వారితోనే పని చేయించుకోవాల్సింది పోయి డబ్బులు ఇవ్వకుండా వారిని పనిభారం ఎక్కువ చేసే వారి మీద దౌర్జన్యంగా కొట్టడం మహిళా గర్భవతిని చూడకుండా కొట్టడంతో ఆరుగురి దెబ్బలను పరిశీలించారు. మెరుగైన వైద్యం కోసం వారిని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇటుక బట్టి యజమానిపై నమోదు చేసి అరెస్టు చేశారు. కార్యక్రమంలో మోహినిద్దీన్ స్థానిక ఎస్సై సైదిరెడ్డి, ఆర్ఐ వెంకట్ రెడ్డి ,మమత ,అధికారులు పాల్గొన్నారు.