Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ అన్ని రంగాల్లో విఫలం
- దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలి
- చౌటుప్పల్ నుండి చండూరు వరకు 300 కిలోమీటర్ల పాదయాత్ర
- సీపీఐ జాతీయ కమిటీ సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి
నవతెలంగాణ-చౌటుప్పల్
బీజేపీని దేశవ్యాప్తంగా ఓడించాలని సీపీఐ జాతీయ కమిటీ సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం కృష్ణా నదిపై చేపట్టిన ఎస్ఎల్బీసీ డిండి లిఫ్టులో భాగంగా చర్లగూడెం ప్రాజెక్టును పూర్తిచేసి మునుగోడు నియోజకవర్గానికి నీరు అందించాలని డిమాండ్‌చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రను గురువారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఆయన పాదయాత్ర బృందం సభ్యులకు పూలమాలలు వేసి, జెండా ఊపి ఆ పార్టీ జాతీయ సమితి సభ్యులు కె.శ్రీనివాస్‌రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములుతో కలిసి పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్ర పట్టణంలోని 65వ నెంబర్ జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున నిర్వహించారు. చాకలి అయిలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బస్టాండ్ దగ్గర నిర్వహించిన సభలో వారు మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలకేంద్రం నుండి చండూరు వరకు 300 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగుతుందన్నారు. 15 రోజులపాటు కొనసాగిన పాదయాత్ర చండూరులో మే 5న ముగింపుసభ జరుగుతుందని తెలిపారు. బీజేపీ గవర్నర్లను అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తుందని విమర్శించారు. బీజేపీ అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించాలన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బీజేపీ మార్చే విధంగా ప్రవర్తిస్తుందన్నారు. అన్ని పార్టీలు ఐక్యంగా ఉంటే ఈ దేశంలో బీజేపీని ఓడించడం ఎంతో సులభమన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో చైతన్యవంతులైన మునుగోడు ప్రజలు బీజేపీని ఓడించి, అడ్డుకట్ట వేశారన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటిని అమలుచేయాలని డిమాండ్‌చేశారు.
సీపీఐ పాదయాత్రకు సీపీఐ(ఎం) సంపూర్ణ మద్ధతు
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎమ్‌డి.జహంగీర్
ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్రను గురువారం చౌటుప్పల్ పట్టణకేంద్రంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎమ్‌డి.జహంగీర్, ఆ పార్టీ నాయకులు బృందం సభ్యులకు పూలమాలలు వేసి మద్ధతు తెలిపారు. అనంతరం నిర్వహించిన సభలో జహంగీర్ మాట్లాడారు. పేదలకు అండగా ఉండేది కమ్యూనిస్టులేనన్నారు. ప్రజలందరిపై పన్నులు వేసి కొందరు కార్పొరేట్లకు రాయితీలు ఇస్తూ ప్రజాధనాన్ని మోడి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని విమర్శించారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు రాష్ట్రాల్లో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నారు. కమ్యూనిస్టులు ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతూనే ఉంటామన్నారు. పాదయాత్ర బృందానికి మద్ధతు తెలిపిన సీపీఐ(ఎం) నాయకులు దోనూరి నర్సిరెడ్డి, ఎమ్‌డి.పాషా, దోడ యాదిరెడ్డి, బూర్గు కృష్ణారెడ్డి, బండారు నర్సింహా, ఉష్కాగుల రమేశ్, తడక మోహన్, ఆకుల ధర్మయ్య ఉన్నారు. పాదయాత్రకు చౌటుప్పల్ మున్సిపల్ చైర్మెన్‌్ వెన్‌రెడ్డి రాజు మద్ధతు తెలిపి మాట్లాడారు. పాదయాత్ర బృందం సభ్యులు నల్లగొండ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, ఆర్.అంజాచారి, కె.శ్రీనివాస్, బి.గాలయ్య, బి.నర్సింహా, జి.రామచంద్రం, కె.వెంకటేశ్వర్లు, నలపరాజు రామలింగం, గిరి రమ, బరిగెల వెంకటేశ్, బూడిద సురేశ్, జి.లాలు, ఎం.మురళి, కృష్ణ, బి.జగన్, చలం పాండురంగారావు, చిలివేరు అంజయ్య, కలకొండ సంజీవ ఉన్నారు. స్థానిక నాయకులు పల్లె శేఖర్‌రెడ్డి, ఉడుత రామలింగం, ఎస్ఎ.రహమాన్, టంగుటూరి రాములు, రొండి నర్సింహా ఉన్నారు.