Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నూతనకల్ :అంగన్వాడీ కేంద్రాలలో బాలింత లకు, చిన్నారులకు ప్రభుత్వం ఐసీడీఎస్ ద్వారా అందించే పోషకాహా రాన్ని లబ్ధిదారులు సద్విని యోగం చేసుకోవాలని సర్పంచ్ తీగల కరుణశ్రీ గిరిధర్ రెడ్డి సూచించారు. గురువారం మండల కేంద్రంలోనీ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన అన్న ప్రసన్న కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పోషక విలువలు ఉన్న పదార్థాలను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని అట్టి పదార్థాలైన పాలు, గుడ్లు, బాలామృతం, మురుకులు వంటివి వినియోగించు కొని శారీరక ఆరోగ్యాన్ని పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు ,ఆయాలు,బా లింతలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.