Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి
నవతెలంగాణ-సూర్యాపేట
దేశంలో అధికారంలో ఉన్న మనువాద పాలకుల నుండి రాజ్యాంగం, రిజర్వేశన్లు ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకై కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఈనెల 16 నుండి 19 వరకు జిల్లా వ్యాప్తంగా జరిగిన రాజ్యాంగ రక్షణ యాత్రను జయప్రదం చేసిన వారందరికీ ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి ధన్యవాదాలు తెలిపారు. గురువారం స్థానిక ఎం వి ఎన్ భవన్ లో జరిగిన విలేకర్ల సమావేశం లో ఆయన మాట్లాడారు. దేశంలో అధికారంలో ఉన్న మనువాద పాలకుల నుండి భారత రాజ్యాంగాన్ని రక్షించడం కోసం ప్రజలను చైతన్యం చేయడం కోసం జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజులపాటు చేపట్టిన రాజ్యాంగ రక్షణ యాత్ర జయప్రదంగా నిర్వహించినట్టు తెలిపారు. రాజ్యాంగ రక్షణ యాత్ర 23 మండలాలు తిరిగి 32 సభలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. ప్రతి మండల కేంద్రం నుండి గ్రామాల్లోకి యాత్ర వెళ్లడంతో అన్ని దళిత, సామాజిక సంఘాలు, రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులు మేధావులు స్వాగతం పలికి మద్దతు తెలిపారన్నారు. అన్ని పక్షాల మద్దతుతో రాబోయే కాలంలో రాజ్యాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బిజెపి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడం కోసం ఉద్యమాలు ఉధతం చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఆ సంఘం నాయకులు బచ్చలికూరి రాంబాబు, దున్న అభి, పిండిగ గోపి, ఉప్పల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.