Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి
నవతెలంగాణ -సూర్యాపేట రూరల్
ఐకెపి కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని సీపీఐ(ం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం సూర్యాపేట మండల పరిధిలోని కుప్పిరెడ్డిగూడెం గ్రామంలోని ఐకేపీ కేంద్రాన్ని ఆయన సందర్శించి ధాన్యం కొనుగోలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు నతనడకగా కొనసాగుతున్నాయన్నారు. వెంటనే వేగవంతం చేయాలన్నారు. ఇంకా ప్రారంభం కాని చోట ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. అకాల వర్షాలు వచ్చి ధాన్యం తడిచి రైతులకు నష్టం జరిగే అవకాశమున్నందున, త్వరితగతిన కొనుగోలు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతాంగానికి అకౌంట్లో డబ్బులు జమ చేయాలన్నారు. గత సీజన్లో ఐకెేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు విషయంలో అవకతవకలు జరిగినట్టుగా తమ దృష్టికి వచ్చిందన్నారు. ఎలాంటి అక్రమాలు, అవినీతి జరగకుండా కొనుగోళ్ల ప్రక్రియ పారదర్శకంగా జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మేకనబోయిన శేఖర్, నాయకులు చిట్లింకి యాదగిరి, బోళ్ల నాగేందర్ రెడ్డి ,పందిరి సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గుంటుపల్లి సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.