Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీఓఏల సమ్మెకు సీఐటీయూ మద్దతు
నవతెలంగాణ-చిట్యాలటౌన్
వీఓఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి అన్నారు. చిట్యాల పట్టణ కేంద్రంలో ఐదవ రోజు శుక్రవారం వీఓఏల సమ్మెకు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి మద్దతు తెలుపుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వీఓఏ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే యూనియన్‌తో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి డిమాండ్లపై చర్చించి సమస్యల పరిష్కారం చేయాలన్నారు. లేని పక్షంలో రోజువారి నిరసన కార్యక్రమాలు ఈనెల 21 న చెవిలో పువ్వులు పెట్టి నిరసన తెలుపటం, 24 న ఒంటి కాలిపై నిలబడి నిరసన తెలపటం, 26న రోడ్లు ఊడ్చి నిరసన తెలపడం, 27 న మోకాళ్లపై కూర్చొని నిరసన తెలపడం, 28 బిక్షాటన, 29 ఆకులు తింటూ నిరసన తెలపడం, మే 1న సమ్మె శిబిరం వద్ద మేడే కార్యక్రమం నిర్వహించడం, మే 3న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు, వంటావార్పు కార్యక్రమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు జిట్టా నగేష్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు నారబోయిన శ్రీనివాస్, సంఘం నాయకులు ఏదుల్లా లక్ష్మి, గుడిసె పద్మ, మహంకాళి వనజ కుమారి, గుడిసె సువర్ణ, పాకాల సత్యనారాయణ, దేశపాక సత్తమ్మ, వడ్డగానీ విజయ తో పాటు కార్మికులందరూ పాల్గొన్నారు.
మర్రిగూడ : మర్రిగూడ మండల కేంద్రంలో ఐకేపీ, వీఓఏలు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం ఐదో రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా వీఓఏలు చెవిలో పువ్వులు పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహకారదర్శి ఏర్పుల యాదయ్య సమ్మెకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వీఓఏల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రంగినేని చంద్రకళ, గంట మంజుల, లెంకలపల్లి పాపాచారి, నక్క సిరియాల, పగిళ్ల పురుషోత్తం, ఏంజాల శిరీష, యాస మానస, మేడిపల్లి భాగ్యలక్ష్మి, కొడాలి కల్పన, వనపర్తి శోభ, పానగంటి పద్మ, ఐదవ సరిత, మలిగిరెడ్డి శోభ, వేమనపల్లి భారతమ్మ, భీంజి, మాధగోని, వనజ, పగడాల, సునంద, కడారి యాదమ్మ, అయితగోని విజయ, సరిత, కవిత, శాంతి, కరుణ, సుమలత, తదితరులు పాల్గొన్నారు.
దామరచర్ల : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వీవోఏలు దామరచర్లలో చేపట్టిన సమ్మె శుక్రవారం 5వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వీవోఏలు చెవిలో పువ్వు పెట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల కార్యదర్శి దయానంద్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష, కార్యదర్శులు సునీత, అజరు, ఉమా, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
నకిరేకల్ : ఐకెపి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం చెవిలో పువ్వు ధరించి ఐకేపీ సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు ఒంటెపాక వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వివోఏల సంఘం మండల గౌరవాధ్యక్షుడు గొర్ల యాదగిరి, ఉపాధ్యక్షురాలు ఎం నిర్మల, ప్రధాన కార్యదర్శి శ్రీలత, కోశాధికారి సంధ్య, ప్రతినిధులు పాల్గొన్నారు.
నాంపల్లి : నాంపల్లి మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం ముందు ఐకేపీ, వీవోఎల ఐదవ రోజు సమ్మె సందర్భంగా శుక్రవారం ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వాసిపాక ముత్తిలింగం సమ్మెకు మద్దతు తెలిపి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా వివోఏలు చెవిలో పువ్వులతో రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీవోఏల సంఘం మండల నాయకురాలు ఎస్కే.సైదాబేగం, ఫర్హాన, రోజారాణి, వెంకటమ్మ, సత్యం, చంద్రకళ, భవాని, సుజాత, తదితరులు పాల్గొన్నారు.
కేతపల్లి : గ్రామ సమాఖ్య వీఓఏల గౌరవ వేతనం 26,000 ఇవ్వాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె కేతపల్లిలో శుక్రవారం ఐదవ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సీఐటీయూ మండల కన్వీనర్ ఆదిమల సుధీర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు వీరభద్రయ్య, పద్మ, శోభ, వివిధ గ్రామాల వీఓఏలు పాల్గొన్నారు.