Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్పీ కే. అపూర్వరావు అధికారులకు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు
నవతెలంగాణ-నల్లగొండ
తెలంగాణ రాష్ట పోలీసు శాఖ చేపట్టిన ఫంక్షనల్ వర్టికల్స్ పటిష్ట అమలు అయ్యేలా చూడాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ నేర విచారణలో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా కన్విక్షన్ రేటుని పెంచాలని, జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పెండింగ్ కేసులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ కే.అపూర్వరావు ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. గత నెలలో జరిగిన నేరాలపై చర్చించి పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని, దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం కోర్టులలో న్యాయమూర్తులతో చర్చించి కేసుల పురోగతి, విచారణ విషయాలలో అధికారులంతా చురుకుగా పని చేయాలని సూచించారు. ఇదే సమయంలో కోర్టు కేసులలో శిక్షల శాతం మరింత పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. విధినిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులను, సిబ్బందిని అభినందించారు. ప్రతిభ కనబరిచే సిబ్బందిని అధికారులను గుర్తించి ప్రతి నెల అధికారులను సిబ్బందిని ప్రోత్సహించే విధంగా రివార్డులు, అవార్డులు, ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో పలు విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 25 మంది సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రొబేషనరీ ఐపీఎస్ శేషాద్రిని రెడ్డి, అడిషనల్ ఎస్పీ కేఆర్కే. రావు, డీఎస్పీలు నరసింహరెడ్డి, వెంకటగిరి, నాగేశ్వర రావు, రమేష్, సిఐ లు, ఎస్ఐలు పాల్గొన్నారు.
ప్రశాంతత వాతావరణంలో 'రంజాన్' జరుపుకోవాలి
ప్రశాంతత వాతావరణంలో ముస్లిం సోదరులు రంజాన్ పండుగ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ఎస్పీ కే .అపూర్వరావు అన్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా శుక్రవారం పట్టణంలోని మునుగోడు రోడ్డులో ఉన్న ఈద్గాను మత పెద్దలతో సందర్శించి పరిశీలించారు. ఈద్గా వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు. వేసవి దృష్ట్యా ముస్లిం సోదరులకు ఈద్గా వద్ద అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నర్సింహారెడ్డి, ట్రాఫిక్ సీిఐ చిర్ల శ్రీనివాస్, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.