Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పూలే, అంబేద్కర్ జాతర విజయవంతం చేయాలి
- కరపత్రం విడుదల
నవతెలంగాణ-మిర్యాలగూడ
మనుధర్మ శాస్త్రాన్ని వ్యతిరేకిద్దాం..భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడగు నాగార్జున పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని ఎంపీడీవో ఆఫీసులో పూలే అంబేద్కర్ జనజాతర కరపత్రాలు సామాజిక ప్రజా కుల సంఘాలతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో కుల వ్యవస్థను కూకటివేలతో పీకి వేయాలని, కుల వ్యవస్థకు మూలమైన మనుధర్మ శాస్త్రాన్ని వ్యతిరేకించి భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందామని నల్లగొండలో జరిగే ఫూలే, అంబేద్కర్ జాతరకు మిర్యాలగూడ నుండి వేలాదిమంది తరలివస్తున్నట్టు తెలిపారు. సబ్బండ కులాలలో ఉన్న సాంస్కతిక దళాలను ఒకే వేదిక మీదికి తీసుకొచ్చి ప్రదర్శింపజేయడం, రాష్ట్రస్థాయి నాయకులు, కవులు, కళాకారులు, మేధావులు, ప్రసంగాలు, ఆట పాట మాట ద్వారా ప్రజలను చైతన్యవంతం చేయనున్నట్లు చెప్పారు. ఈనెల 28న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం వరకు నల్లగొండలోని ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్లో జాతర నిర్వహించబడుతుందని తెలిపారు. షెడ్యూల్ కులాల ఉద్యోగుల సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాడ్గుల శ్రీనివాస్, గీతా కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చౌగోని సీతారాములు మాట్లాడుతూ మనిషిని మనిషిగా చూడాలని, కులం పేరా, మతం పేరా ద్వేషించడం, దూషించడం దాడి చేయడం చంపి వేయడం మానుకోవాలని, అలాంటి రాక్షస మూకలను కఠినంగా శిక్షించాలన్నారు. ఈ జాతరకు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసిం, నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్‌రెడ్డి, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పగడాల నాగేందర్, అంబటి నాగయ్య, స్కైబాబా, అనిత కుమారి చక్రారి రామరాజు మందడి సైదిరెడ్డి బుర్ర సుధాకర్ అనేకమంది పాల్గొననునట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ దోసపాటి శ్రీనివాస్, సీనియర్ పాత్రికేయులు హమీద్,రజక సంఘము జిల్లా కార్యదర్శి పోద్దిల శ్రీను, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొడిరెక్క మల్లయ్య, మాజీ కౌన్సిలర్ పాండు, అవాజ్ జిల్లా నాయకులు ఆయుబ్, రైతు సంఘము నాయకులు మంగారెడ్డి, సీఐటీయూ నాయకులు తిరుపతి రాంముర్తి, బీసీ సంఘము నాయకులు రాజు, కేవీపీఎస్ జిల్లా నాయకులు పాపారావు పాల్గొన్నారు.