Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య
- జిల్లా అధ్యక్ష, ప్రధాకార్యదర్శులుగా దాసరిపాండు, కల్లూరి మల్లేశం
నవతెలంగాణ-భువనగిరి
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఘనంగా వారం రోజుల పాటు కార్మికులు ఉత్సవాలు నిర్వహించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం సీఐటీయూ జిల్లా కమిటి సమావేశం దాసరి పాండు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎనిమిది గంటల పనికోసం పోరాడి కార్మికులు రక్తతర్పనం గావించి పని గంటలు సాధించిన మే1ని ఘనంగా నిర్వహించాలన్నారు. మోడి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను రద్దు చేశాడన్నారు. ,కార్పొరేట్లకు ఉపయోగపడే చట్టాలు తీసుకువచ్చి కార్మికులను ఆధునిక బానిసలుగా మార్చాడని విమర్శించారు.ప్రతి చోట 12 గంటలు కార్మికుడు కష్టపడుతున్నాడన్నారు. అయిన కార్మికుని కుటుంబం గడిచే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుని కనీస రోజు వేతనం రూ.178 రూపాయలు గా కేంద్ర నిర్ణయించడాన్ని బట్టి చూస్తే బీజేపీి ప్రభుత్వం ఎవరి వైపు ఆలోచిస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు.
సీఐటీయూ నూతన జిల్లా అధ్యక్ష,కార్యదర్శుల ఎన్నిక
నూతన జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా దాసరి పాండు, కల్లూరి మల్లేశం శుక్రవారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఎన్నుకున్నారు.ఇప్పటి వరకు జిల్లా కార్యదర్శిగా పని చేసిన కోమటిరెడ్డి చంద్రారెడ్డి క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించినందున జిల్లా కార్యదర్శితో పాటు అన్ని బాధ్యతల నుండి తగ్గిస్తూ జిల్లా కమిటీ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు జిల్లా అధ్యక్షునిగా ఉన్న కల్లూరి మల్లేశంను జిల్లా కార్యదర్శిగా, జిల్లా ఉపాధ్యక్షునిగా ఉన్న దాసరి పాండును జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు వీరయ్య తెలిపారు.