Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీ సీఈఓ సురేష్
నవతెలంగాణ-నేరేడుచర్ల
వేసవి కాలం కావడంతో నాటిన మొక్కలు ఎండిపోకుండా నీరుపోసి సంరక్షించాలని జెడ్పీసీఈఓ సురేష్ సూచించారు.శుక్రవారం మండలంలోని చిల్లేపల్లి గ్రామ పంచాయతీలో గ్రీన్ డే సందర్భంగా గ్రామపంచాయతీ పనులను పరిశీలించారు.చింతకుంట్ల అవెన్యూప్లాంటేషన్ మొక్కలకు నీరు పోసిన అనంతరం బోడల్దిన్న గ్రామనర్సరీ, శ్మశానవాటికను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవికాలంలో నీటిఎద్దడికి మొక్కలు ఎండిపోకుండా క్రమం తప్పకుండా నీరు పోసి వాటిని రక్షించాలని, మిషన్ భగీరథ పథకం ద్వారా గ్రామాలలో నిరంతరం నీటి సరఫరా చేయాలని, అసంపూర్తిగా ఉన్నటువంటి భగీరథ పనులను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలన్నారు.మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో కార్యాలయ రికార్డులను పరిశీలించారు.రికార్డుల నిర్వహణ పట్ల సంతప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్అభివద్ధి అధికారి పి.శంకరయ్య, మండల పంచాయతీ అధికారి ఇ.విజయకుమారి, పర్యవేక్షకులు ఆర్.విజయనిర్మల, ఏపీఓ శేఖర్, ఈసీ మహేష్, టెక్నికల్ అసిస్టెంట్ అజీమ్,పంచాయతీ కార్యదర్శి సీహెచ్.రమేష్ ,ఆర్.వర్య పాల్గొన్నారు.