Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ
నవతెలంగాణ -భువనగిరి రూరల్
మే 1నుండి 7వ తేదీ వరకు మేడే ఉత్సవాలను గ్రామ గ్రామాన నిర్వహించి జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ పిలుపు నిచ్చినారు. శనివారం సుందరయ్య భవన్ భువనగిరిలో ఆ పార్టీ భువనగిరి మండల కమిటీ సమావేశం మండల కార్యదర్శివర్గ సభ్యులు అన్నంపట్ల కష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు 8గంటల పనిదినం కోసం, కార్మిక చట్టాలు, హక్కుల కోసం అనేక పోరాటాలు చేసి ప్రాణ త్యాగాలు చేసి ఆ హక్కులను సాధించుకుంటే నేడు కేంద్రంలో పరిపాలన చేస్తున్న బీజేపీ మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్మిక చట్టాలు రద్దుచేసి, లేబర్ కొడ్లనుతెచ్చిందన్నారు. బడాపెట్టుబడిదారులకు , బహుళజాతి సంస్థల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటిని ప్రయివేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తూ అమ్ముతున్న పరిస్థితి ఉన్నదన్నారు. రాజ్యాంగంలో ఉన్న హక్కులను విధులను కాలరాశి మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయడానికి మతోన్మాద బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని ఈ విధానాలకు వ్యతిరేకంగా మేడే సందర్భంగా ఒకటి నుండి ఏడు వరకు గ్రామ గ్రామాన వాడ వాడనా కార్మిక కర్షక ఐక్యతో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తూ మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ మండల కార్యదర్శి వర్గ సభ్యులు కొండ అశోక్, మండల కమిటీ సభ్యులు సిలివేరు ఎల్లయ్య, పాండాల మైసయ్య, మోటె ఎల్లయ్య,ఎల్లంల వెంకటేష్, అబ్దులపురం వెంకటేష్, కొండాపురం యాదగిరి పాల్గొన్నారు.