Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
రాజ్యాంగ హక్కులను, రాజ్యాంగ విలువలను కాలరాస్తున్న మతోన్మాద బీజేపీిని తెలంగాణలోకి రాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత వామపక్షవాదులపైనే ఉందని సీపీఐ నల్గొండ జిల్లా కార్యదర్శి, పాదయాత్ర బందం ఇన్చార్జి నెల్లికంటే సత్యం అన్నారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర మూడవ రోజు శనివారం మండలంలోని గాంధీ నగర్ తండా గంగ మూల తండా వచ్చే తండా జనగాం ఆరెగూడెం వైర్లపల్లి చిల్లాపురం లచ్చమ్మ గూడెం గ్రామాల్లో కొనసాగింది. వాయిల పెళ్లి గ్రామంలో సీపీఐ(ఎం)నాయకులు చింతకాయల నరసింహ, కుక్కల లింగయ్య,కుక్కల అంజయ్య, సిహెచ్ లింగస్వామి,సిహెచ్ సత్తయ్య పాదయాత్ర బందం సభ్యులకు పూలమాలలు వేసి స్వాగతం పలికి సంపూర్ణ మద్దతు తెలిపారు.సంఘీభావంగా పాదయాత్రలో మాట్లాడారు. మతోన్మాద బీజేపీిని తెలంగాణ గడ్డపై అడుగు పట్టకుండా చూడాల్సిన బాధ్యత లౌకిక శక్తుల ప్రథమ కర్తవ్యం గా తీసుకోవాలన్నారు. మునుగోడు నియోజకవర్గం లో నిర్మించ తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో పాదయాత్ర బంధం నాయకులు ఆర్.అంజచారి, కె.శ్రీనివాస్,బి.గాలయ్య, బి. నరసింహ, జి.రామచంద్రం, వెంకటేశ్వర్లు, రామలింగం, గిరి రమ, బి.వెంకటేష్, సురేష్, బి.లాలు, ఎం.మురళీకష్ణ, బీ.జగన్, సిహెచ్. పాండురంగారావు, సిహెచ్.అంజయ్య, క. సంజీవ తదితరులు పాల్గొన్నారు.