Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
మే నెల 28 నుంచి 31 తేదీ వరకు ఆలేరు పట్టణంలోని శ్రీ కనకదుర్గ దేవి ఆలయ ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఆలేటి రంగన్న, ఆలయ చైర్మెన్ కొలుపుల హరినాథ్ తెలిపారు.శనివారం ఆలయం ఆవరణలో ఆలేరు శ్రీ దుర్గా మాత ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ పెద్దల సమక్షంలో శ్రీ రంగన్న పంతులు ఆధ్వర్యంలో మే నెల 28 29 30 31 తేదీలలో శ్రీ దుర్గా మాత ఉత్సవాలను జరిపేందుకు పెద్దల సమక్షంలో నిర్ణయించారు. పుర ప్రముఖులు ప్రజలు పై తేదీలలో శ్రీ దుర్గా మాత వేడుకలను ఘనంగా నిర్వహించుకోటకు సన్నద్ధం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పుర ప్రముఖులు బేతి రాములు, సముద్రాల సత్యం, యేలుగల పాపయ్య, ఎలుగల అంజయ్య, నీలం వెంకటస్వామి, కామెటికారి కష్ణ ,మొరిగాడి బాలరాజు, ఘనగాని రామ్ గౌడ్ ,సముద్రాల కుమార్, వడ్డేమాన్ కిషన్, సీస సత్తయ్య, బింగి నరసింహులు, వడ్డేమాన్ నరేందర్ ,తునికి దశరథ, రమేష్ ,కొరుటూరి ఇస్తారి, నరసింహులు, శ్రీనివాసు పాల్గొన్నారు.