Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
- మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-అడవిదేవులపల్లి
బీజేపీ హఠావ్..భారత్ బచావ్ పోరాట రణ నినాదం పద్దునేక్కి దూసుకొని వస్తుందని, ఆ పోరాటంలో ప్రజలు భాగస్వాములు కావాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం అడవిదేవులపల్లి మండలంలో సీపీఐ(ఎం) జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశంలో బ్రిటీష్ తరహ పాలన సాగుతోందని, ప్రజల కష్టార్జితంతో నిర్మించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను కంపెనీలను, ప్రజల ఆస్తులన్నీ ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు మోదీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని తెలిపారు. ఇందు కోసం ఎసెట్ మానిట్కెజేషన్ పైపుల్కెన్ను తీసుకొచ్చిందని, దేశంలోని 400 రైల్వేలైన్న్లు, 100 రైళ్లువిమానాశ్రయాలు, చమురు పైపుల్కెన్లు, జాతీయ రహదారులు, అమ్మకానికి పెట్టింది. కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేసేలా కార్మిక చట్టాల్లో మార్పులు చేస్తూ లేబర్ కోడ్లను రూపొందించిందని తెలిపారు. విద్యుత్ సవరణ చట్టం పేరుతో చీకట్లను నింపుతోందని ఉపాధి అవకాశాలు పూర్తిగా లేకుండా పోయాయనీ బ్యాంకింగ్ రంగాన్ని సర్వనాశనం చేసే దిశగా అడుగులు వేస్తోందన్నారు. మోదీ పాలనలోని ఈ లోపాలపై చర్చ జరుతుందనే భావన కలిగినప్పుడల్లా మందిర్, మసీదు, హిందూ, ముస్లిం అంటూ తమ మతతత్వ అమ్ముల పొదిలోని అస్త్రాలను ప్రయోగిస్తూ ప్రజల మధ్య మత చిచ్చు పెడుతోందని విమర్శించారు. మండల కేంద్రంలో ఉన్న ముఖ్యమైన సమస్యలు సత్రశాల కష్ణా నదిపై బ్రిడ్జ్ వంతెన ఏర్పాటు చేయాలని, పోడు భూములకు పట్టాలి ఇవ్వాలి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వేగవంతం, మండల కేంద్రంలో సొంత భవనాలు ఏర్పాటు చేయాలి కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, జటంగి సైదులు, వినోద్ నాయక్, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు పాపానాయక్, ప్రతాపరెడ్డి, గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుర్ర శంకర్‌నాయక్, సీపీఐ(ఎం) నాయకులు సైదా నాయక్, శివ నాయక్ కోటిరెడ్డి, బాల సైదులు, రాంబాబు హనుమంతు, రామాంజనేయులు రంగానాయక్, సాంబయ్య, రామ తులసమ్మ, అనసూయమ్మ, కుమారి తదితరులు పాల్గొన్నారు.