Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫూలే, అంబేద్కర్ జనజాతరను జయప్రదం చేయండి
- కరపత్రాల పంపిణీలో పలువురు వక్తలు
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
సమాజంలో రోజురోజుకు పెరిగిపోతున్న అంతరాలు, దోపిడీదారుల కుట్రలకు సబ్బండ కులాలు బలవుతున్నాయని, మూఢనమ్మకాలు అజ్ఞానం వైపు ప్రజలను తీసుకెళ్తున్నారని, ప్రజలను విజ్ఞానం వైపు మళ్ళించడమే జన జాతర ఉద్దేశమని రిటైర్డ్ ఐఏఎస్ చోలేటి ప్రభాకర్, గురుకులాల ప్రిన్సిపల్ గాదె లింగస్వామి, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెంకులు, మాదిగ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లెపాక వెంకన్న అన్నారు. ఆదివారం కేవీపీఎస్, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుండి ఎన్జీ కాలేజీ వాకర్స్‌కి పూలే అంబేడ్కర్, జనజాతర కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ దేశం అభివృద్ధి జరగాలన్న సమ సమాజం నిర్మాణం జరగాలన్న చదువే ప్రాధాన్యమని, అందులోని శాస్త్ర సాంకేతిక విజ్ఞానమే ప్రధానం తప్ప మూఢనమ్మకాలు, జ్యోతిష్యాలు కావని అన్నారు. చరిత్రని తుడిపి వేయాలని చూస్తున్న మనువాదులు చరిత్రలో కనుమరుగవడం ఖాయమని పేర్కొన్నారు. ఏప్రిల్ 28న నల్లగొండ ఎస్బిఆర్ ఫంక్షన్ హాల్లో పూలే అంబేడ్కర్ జన జాతరను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఓయూ ప్రొఫెసర్ కాసిం, తప్పెట్ల స్కైలాబ్ బాబు, కెేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆర్. శ్రీరామ్‌నాయక్, గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ చోలేటి ప్రభాకర్, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పగడాల నాగేందర్, గాదే లింగస్వామి, అనిత కుమారి, బాబా చక్రహరి రామారావు, సుధాకర్, పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. ఈ కరపత్రాల పంపిణీ కార్యక్రమంలో ఎంఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జ్ బకరం శ్రీనివాస్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగాని జనార్దన్‌గౌడ్, ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షుడు మానుపాటి భిక్షమయ్య, కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి జీ. నరసింహ, గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కొండా వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.