Authorization
Sat March 29, 2025 04:14:24 pm
నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్
మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకను ఆదివారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ సంక్షేమ భవన్ బీసీ సంక్షేమశాఖ అధికారి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారిణి పుష్పలత మహాత్మా బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మహనీయులను స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో ముందుకు సాగేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం మహనీయుల జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోందని తెలలిపారు. ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్, బలిజసంగం నల్లగొండ జిల్లా అధ్యక్షులు పొగాకు నాగరాజు, సంఘ సభ్యులు ఇమ్మడి పరమేష్, శేఖర్, ఈశ్వరయ్య, కర్ణ వరప్రసాద్, ఆనంద్, వినయ్, కొండూరు సత్యనారాయణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.