Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
నకిరేకల్ మున్సిపాలిటీలో ప్రధాన రహదారి విస్తరణ పనులు అప్పుతో చేయడం వల్ల మున్సిపాలిటీ ప్రజలను ప్రమాదంలో పడవేసినట్లేనని టీపీసీసీ రాష్ట్ర మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి దైద రవీందర్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుండి రూ. 26 కోట్లు అప్పు తీసుకుని రోడ్లు విస్తరణ చేయడంలో గల ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఈ అప్పు వడ్డీతో సహా మున్సిపాలిటీ ప్రజలపై పడుతుందన్నారు. అభివృద్ధి, ప్రజా అవసరాల నిమిత్తం పట్టణంలోని వ్యాపారస్తులు, ప్రజలు స్వచ్ఛందంగా 50 ఫీట్ల వెడల్పు కోసం తమ భవనాలను కటింగ్ చేస్తున్న తరుణంలో భవనాల పోర్టుకోలతో డ్రైనేజీకి ఎలాంటి ఇబ్బంది లేకున్నా అభివృద్ధి పేరుతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం సరైనది కాదన్నారు. ఈ సమావేశంలో మాజీ సింగిల్ విండో చైర్మెన్ గార్లపాటి రవీందర్‌రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు దూలం సోమయ్య, రంగు వీరయ్య, చెనగోని రాజశేఖర్‌గౌడ్, ప్రభు కుమార్, చెరుపల్లి సైదులు, పశుపతి, దైద సురేష్, నర్సింగ్ మహేష్‌గౌడ్, వంటెపాక సతీష్, వంటెపాక నక్షత్, నల్గొండ సాయి, మహేష్ , పందిరి సతీష్ పాల్గొన్నారు.