Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాలటౌన్
నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా సీసీ రోడ్లు నిర్మిస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి అవిశెట్టి శంకరయ్య అన్నారు. ఆదివారం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఆరో వార్డు వెంకటాపురంలో వేస్తున్న సిమెంటు రోడ్ల పనులను పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనలు, నాణ్యత ప్రమాణాలను పాటించకుండా కాంట్రాక్టర్ తన ఇష్టానుసారంగా రోడ్లను వేస్తున్నారని తెలిపారు. పర్యవేక్షించాల్సిన అధికారులు అక్కడ ఎవరూ ఉండకపోవడం వలన సదర్ కాంట్రాక్టర్ తనకి ఇష్టం వచ్చిన విధంగా రోడ్లు వేస్తూ అడిగిన గ్రామ ప్రజలపై దురుసుగా ప్రవర్తిస్తున్నాడని, పైగా మేము అన్నిచోట్ల కంకర పొడి తోటే వేస్తున్నము ఇక్కడ కూడా ఇలాగే వేస్తాం అని గ్రామస్తులను బెదిరిస్తున్నాడని ఆరోపించారు. సంబంధిత కాంట్రాక్టు లైసెన్స్‌ను రద్దు చేసి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం గ్రామస్తులు చిరబోయిన నరసింహ, చి రబోయిన గట్టయ్య, మాదరబోయిన వెంకన్న, కొమిడాల రాంరెడ్డి ,మణమ్మ ,కట్ట యాదయ్య , అవిశెట్టి కిరణ్, మెండే ఇస్తారమ్మ తదితరులు పాల్గొన్నారు.