Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
ఈనెల 25న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలో గునుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్న ప్లీనరీని విజయవంతం చేయాలని రాజ్యసభ సభ్యులు, జిల్లా అధ్యక్షులు బడుగు లింగయ్య యాదవ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తొలుత ఆయా గ్రామాలలో పార్టీ శ్రేణులు వార్డుల వారీగా గులాబీ జెండాను ఆవిష్కరించాలని సూచించారు. అనంతరం 11 గంటలకు భారీగా ప్లీనరీకి తరలిరావాలని కోరారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అందుకే దేశవ్యాప్తంగా రాష్ట్రాలలోని ప్రజలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. నాయకులు అప్రమత్తతతో ఎవరికి వారు శ్రేణులను ప్లీనరీకి స్వచ్ఛందంగా తరలివచ్చే విధంగా బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు సుంకర అజరు కుమార్, శీలం సైదులు, ఎంపీపీ చింత కవితారాదారెడ్డి, సత్యబాబు, ఆంజనేయులు, వెంకటేశ్వరరావు, బట్టు శివాజీ, తుమ్మలపల్లి భాస్కర్, చందు నాగేశ్వరరావు, బెజవాడ శ్రవణ్,వేనేపల్లి వెంకటేశ్వరరావు, గింజుపల్లి రమేష్, సత్యవతి, ఎస్కే.రహీం, ముస్తఫా, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.