Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహాత్మా బసవేశ్వరుడి ఉపదేశాన్ని గుర్తించుకోవాలి
- బసవ భావన నిర్మాణానికి మంత్రి ఆదేశాలు
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
800 కిందే సమాజంలో కుల, వర్ణ, లింగ బేధాలు లేవని అందరు సమానమేనని చాటి చెప్పిన ప్రముఖుడు బసవేశ్వరుడని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.సమాజంలో కుల వ్యవస్థను వర్ణ భేదాలను, లింగ వివక్షను సమూలంగా వ్యతిరేఖించిన గొప్ప అభ్యుదయ వాధి బసవేశ్వర స్వామి అని కొనియాడారు.జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఆదివారం జిల్లా వెనుకబడిన శాఖ ఆధ్వర్యంలో మహాత్మా బసవేశ్వర 890జయంతిని పురస్కరించుకుని బసవేశ్వర చిత్ర పటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభ్యుదయవాది, వీరశైవ మత స్థాపకుడు మహాత్మ బసవేశ్వరుని జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా అధికారికంగా నిర్వహిస్తుందన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సమసమాజ స్థాపనకు పాటు పడిన వారిని స్మరిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు.లింగాయత్ లింగ బలిజ సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్ వారి సభ్యులు కోరిన రుద్రభూమి, బసవ భవన నిర్మాణం అలాగే ఆ ప్రాంగణంలో బసవేశ్వర విగ్రహ ఏర్పాట్లు త్వరలోనే శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుందామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.సమావేశం మందిరంలో ఉన్న సంఘ సభ్యులు అందరూ మంత్రిగారు ఇచ్చిన వాగ్దానానికి అందరూ నిలబడి కరాల ధ్వనులతో మంత్రికి తమ అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎస్ మోహన్ రావు డిఆర్ఓ రాజేంద్ర కుమార్ లింగాయత్ లింగ బలిజ సంఘం అధ్యక్షులు ఎస్ చంద్రశేఖర్ గౌరవాధ్యక్షులు ఎస్ఎస్ సోమయ్య కార్యదర్శి పి శేఖర్ కోశాధికారి డి శ్రీనివాస్ గారి జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.