Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లినర్సిరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
ప్రభుత్వం చొరవ చూపి ఉపాధ్యాయుల పదోన్నతులు,బదిలీలు వేసవిలో నిర్వహించాలని నల్లగొండ,ఖమ్మం, వరంగల్ నియోజక వర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉపాధ్యాయులు, కాంట్రాక్టు అధ్యాపకులు, గురుకుల ఉపాధ్యాయులు,కస్తూర్బా పాఠశాలల ఉపాధ్యాయురాళ్లతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో ఆయన మాట్లాడారు.నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని,నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాతపెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు.కాంట్రాక్ట్ లెక్చరర్స్‌ను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.కేజీబీవీ సీఆర్టీలకు కనీసవేతనం ఇవ్వాలని కోరారు.పాఠశాలల్లో సర్వీస్పర్సన్స్ను నియమించాలని కోరారు.ఉన్నత పాఠశాలల్లో నైట్ వాచ్మెన్ నియ మించాలన్నారు.ఈసందర్భంగా ఉపాధ్యాయులతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన సమాధానాలిచ్చారు.ఈ సమావేశంలో అధ్యక్షులు ఎన్.సోమయ్య, ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్‌కుమార్,ఉపాధ్యక్షులు పి.శ్రీని వాస్‌రెడ్డి,కోశాధికారి జి.వెంకటయ్య,రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు జె. యాకయ్య,జిల్లా కార్యదర్శులు ఎస్కె.సయ్యద్, సీహెచ్.వీరారెడ్డి, బి.పాపిరెడ్డి, వి.రమేష్,బి.ఆడమ్,ఎస్టీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.క్రాంతికుమార్,కాంట్రాక్ట్ లెక్చరర్ల అసోసియేషన్ జల్లా అధ్యక్షులు శ్రీనివాస్,మహిళా కమిటీ కన్వీనర్ జె.క్రాంతిప్రభ,మినీ గురుకుల అసోసియేషన్ రాష్ట్ర నాయకులు లక్ష్మీ, మైనార్టీ గురుకుల నాయకులు శారద, సోషల్‌మీడియా కన్వీనర్ డి.శ్రీనివాసాచారి, అకాడమిక్ సెల్ కన్వీనర్ ఆర్.శ్రీను,సాంస్కృతిక కమిటీ కన్వీనర్ బి.ఆనంద్, యరగాని.లింగయ్య,బండ్ల.రమేష్ ఏలే.శీనయ్య,దామళ్ల. నరేందర్. డి.బాలాజీ,పి.కర్నాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
పదోన్నతులు బదిలీలు చేపట్టాలి
హుజూర్‌నగర్‌టౌన్ :ప్రభుత్వం చొరవ చూపి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు వేసవిలో నిర్వహించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లినర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక హుజూర్నగర్ మండల పరిషత్ సమావేశ మందిరంలో ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ అధ్యాపకులు, గురుకుల ఉపాధ్యాయులు, కస్తూర్బా పాఠశాలల ఉపాధ్యాయినీలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా ఆయన హాజరై మాట్లాడారు. నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని, నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. కాంట్రాక్ట్ లెక్చరర్స్‌ని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కేజీబీవీ సీఆర్టీలకు కనీస వేతనం ఇవ్వాలని, పాఠశాలల్లో సర్వీస్ పర్సన్స్‌ని నియమించాలని, ఉన్నత పాఠశాలల్లో నైట్ వాచ్ మెన్ నియమించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ .అనిల్ కుమార్, ఉపాధ్యక్షులు పీ.శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కార్యదర్శులు ఆర్.దామోదర్, నాగేశ్వర రావు, జెట్టి కమల , సీనియర్ నాయకులు చెన్నా సైదులు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు బీరెళ్ళి శ్రీనివాసరెడ్డి, నలబోలు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.