Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మలేరియా నిర్మూలనపై స్టాల్స్‌ను ప్రారంభించిన కలెక్టర్
నవతెలంగాణ-భువనగిరిరూరల్
ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఒక రోజు ముందుగానే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య , ఆరోగ్య శాఖాధికారి ఆధ్వర్యములో సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయములో మలేరియా వ్యాధి నిర్మూలన పై అవగాహన శిబిరాన్ని, స్టాల్‌ను ఏర్పాటు చేయగా, ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరై ప్రారంభించి, మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలలో మలేరియ , కీటక జనిత వ్యాధుల నివారణ గురించి ప్రజలందరికి అవగాహన కల్పించి , వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించాలన్నారు. ఈనెల 25న ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్ర ఆసుపత్రి నుండి జగదేవ్‌పూర్ చౌరస్తా వరకు ర్యాలీని నిర్వహించాలన్నారు. ఈ సందర్బముగా జిల్లా వైద్య , ఆరోగ్య శాఖా అధికారి డా కే మల్లికార్జున రావు మాట్లాడుతూ వర్షాకాలములో మలేరియ, డెంగ్యు వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా వుంటాయని, వ్యాధి కారక లార్వాలను ఎప్పటికప్పుడు నాశనం చేయాలని , ప్రతి శుక్రవారం డ్రై డే గా పాటించాలన్నారు. ఈ కార్యక్రమములో జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మలేరియా అధికారి డా పోటు వినోద్ , అసిస్టంట్ మలేరియా ఆఫీసర్ ఎన్.మధు మోహన్‌రావు , సిబ్బంది పాల్గొన్నారు.