Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు
నవతెలంగాణ-వలిగొండరూరల్
జీవితాంతం నీతి నిజాయితీ నిబద్ధతతో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేసిన గొప్ప వ్యక్తి ఫైళ్ల మల్లారెడ్డి అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు,జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, మండల కార్యదర్శి సిర్పంగి స్వామిలు అన్నారు. సోమవారం మల్లారెడ్డి 17 వర్థంతి సందర్భంగా గ్రామంలో ఆయన స్థూపం వద్ద ఆపార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ పైళ్ల మల్లారెడ్డి ఉన్నత వర్గంలో పుట్టినప్పటి నుండి సాయుధ తెలంగాణ పోరాట స్ఫూర్తిని పొంది కమ్యూనిస్టు పార్టీ నాయకులుగా చివరిదాకా పనిచేశా రన్నారు. గ్రామానికి సర్పంచ్ గా పనిచేసిన కాలంలో అనేక రకాల అభివృద్ధి పనులతో పాటు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి కులమత బేధాలు లేకుండా అందరితో కలిసి పోయేవారన్నారు. ఆయనలో ఉన్న సేవాగుణం ద్వారా దాత ఎన్నారై పైళ్ల మల్లారెడ్డి ఏర్పాటుచేసిన సుంకిశాల వెంకటేశ్వర స్వామి దేవాలయం,వలిగొండ మండల కేంద్రంలో జూనియర్ కళాశాల నిర్మాణంలో కీలకంగా వ్యవహరించి వాటి నిర్మాణాలు దగ్గరుండి బాధ్యతతో పూర్తి చేయించారని అన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థూపం వద్ద సీనియర్ నాయకులు కొమ్మిడి లక్ష్మారెడ్డి జండా ఆవిష్కరణ చేయగా,వారి కుటుంబ సభ్యులు మాజీ సర్పంచ్ పైళ్ళ సంధ్యారాణి ఆనంద్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు తుర్కపల్లి సురేందర్, మండల కమిటీ సభ్యులు కందడి సత్తిరెడ్డి, బుగ్గ చంద్రమౌళి, కవిడే సురేష్, స్థానిక శాఖ కార్యదర్శి గూడూరు వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు పైళ్ళ పెద్ద మోహన్ రెడ్డి, చిన్న మోహన్ రెడ్డి, పిఎన్ఎం జిల్లా కార్యదర్శి ఈర్ల పెళ్లి ముత్యాలు, పార్టీ నాయకులు మంగ బాలయ్య, చెరుకు జంగయ్య,ఎడవెల్లి రాములు,కాటేపల్లి పాండు, పోలేపల్లి పెద్ద స్వామి మంగ పాండు,గుర్రం సత్తి రెడ్డి,బాల్ రెడ్డి,గూడూరు భగవంత్ రెడ్డి, సత్తయ్య పాల్గొన్నారు.