Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అకాల వర్షాల వలన తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం
- పంట నష్టాన్ని అంచనా వేసి ఆదుకుంటాం
- కలెక్టర్ వెంకట్రావు
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
ప్రజావాణిలో అర్జీదారులు అందించిన అర్జీలను ఆయా శాఖల అధికారులు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎస్.మోహన్ రావుతో కలిసి పాల్గొని అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు.ఈ సందర్బంగా కలెక్టర్ వే బేక్స్ ద్వారా మాట్లాడుతూ అకాలవర్షాల వలన కల్లాల్లో ఉన్న ధాన్యం అలాగే ప్రభుత్వ కొనుగోలుకేంద్రాలలో తడిసిన ధాన్యం కొనుగోలుకు ప్రత్యేకచర్యలు తీసుకోవాలని తెలిపారు.ఇప్పటికే మంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో వేగంగా సంబంధిత శాఖల ద్వారా పంట నష్టం అంచనా వేసి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు.జిల్లాలో 33 శాతం కంటే ఎక్కువ పంట నష్టం వాటిల్లిన చోట ఉద్యాన, వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు పంట అంచనా వేసి నివేదిక పంపాలని తెలిపారు. ప్రభుత్వ కొనుగోలుకేంద్రాలలో అకాల వర్షాల తడిసిన ధాన్యం అంచనాకు డీఆర్డీఏ పీడీ, మెప్మాపీడీ, తహసీల్దార్లు, ఏపీఓలు అంచనా నివేదికను సేకరించాలని పేర్కొన్నారు.తడిసిన ధాన్యం కొనుగోలుకై సివిల్ సప్లై అధికారులు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఆడిగిన వేంటనే తడిచిన ధాన్యాన్ని పారాబాయిల్ మిల్లుల యాజమాన్యాలు కొనుగోలుకు తమ అంగీకారం తెలిపారన్నారు.జిల్లాలో రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఫైల్స్ సత్వర పరిష్కారానికి సమయం వృధా కాకుండా ఈ ఆఫీస్ ద్వారా ఫైల్స్ పంపాలని ఆర్డీఓలకు ఆదేశించారు.ప్రజావాణిలో భూసమస్యలపై 20 దరఖాస్తులు, గ్రామీణాభివృద్ధి శాఖ 9, ఇతర శాఖలకు సంబంధించినవి 1 మొత్తం 30 దరఖాస్తులు అందాయన్నారు.దరఖాస్తులు సత్వర పరిష్కారం కోసం సంబంధిత శాఖలకు చర్యలకోసం పంపించామన్నారు.కలెక్టరేట్ కార్యాలయంలో వడదెబ్బ ప్రథమ చికిత్సాకేంద్రాన్ని ప్రారంభించారు.ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏఓ శ్రీదేవి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
సేవాదృక్పథం అలవర్చుకోవాలి
ఆర్యవైశ్య మహిళా సంఘానికి అభినందనలు
కలెక్టర్ వెంకట్రావ్
జిల్లాలో ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్నందున జిల్లాలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహర్తిని తీర్చాలని కలెక్టర్ యస్.వెంకట్రావ్ అన్నారు.జిల్లాలో సచ్ఛందసంఘాలు ముందుకు రావాలని ఈ సందర్బంగా పిలుపునిచ్చారు.సోమవారం కలెక్టరేట్ నందు జిల్లా ఆర్య వైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాలివేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఏర్పాటు చేసిన ఈ చలి వేంద్రం ద్వారా కలెక్టరేట్ కు వచ్చే ప్రజలకు చల్లటి తాగునీటితో పాటు మజ్జిగ రెండు నెలలపాటు అందిస్తున్న ఆర్యవైశ్య మహిళాసంఘాన్ని అభినందించారు.అనంతరం పేద మహిళ జి.రజితకు సంఘం తరపున కలెక్టర్ అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మాశెట్టి అంతరాములు, మహిళా అధ్యక్షురాలు గుండాశ్రీదేవిమురళి, కార్యదర్శి మీలా వీరమణి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.