Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
నేరేడుచర్ల మండలకేంద్రంలోని అరిబండి భవన్లో డార్విన్ పరిణామ సిద్ధాంతం చాప్టర్ సీబీఎస్ఈ సిలబస్ తొలగింపును నిరసిస్తూ కేవీపీఎస్ ఆధ్వర్యంలో సోమవారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షులు మర్రి నాగేశ్వర్రావు మాట్లాడారు. కేంద్రంలో మోడీ అధికారంలోకొచ్చిన 8 ఏండ్లకాలంలో కవులు, రచయితలు, మేధవులు, లౌకికవాదులు, జర్నలిస్టులపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు చేశారన్నారు.దళితులు, క్రిస్టియన్స్, మైనార్టీలపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంఫ్‌ుపరివార్ శక్తులు దాడి చేశాయని విమర్శించారు.భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సామ్యవాద మతసామరస్యాన్ని కాలరాస్తున్నారని విమర్శించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు దూళిపాలధనుంజయనాయుడు, సీపీఐ(ఎం) టౌన్ కార్యధర్శి కొదమగుండ్ల నగేష్, సీఐటీయూ జిల్లా నాయకులు కందగట్ల అనంతప్రకాశ్, టీడీపీ మండల అధ్యక్షులు ఇంజమూరివెంకటయ్య, కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండలఅధ్యక్షులు ఊట్కూరి సైదులు, కేవీపీఎస్ నాయకులు దోరేపల్లి వెంకటేశ్వర్లు, బీఎస్పీ నాయకులు రాపోలు నవీన్, చిలకరాజు శ్రీను, నీల రామ్మూర్తి, ఎడ్ల సైదులు, కత్తి శ్రీనువాస్‌రెడ్డి, సట్టు వెంకన్న, కర్రి సతీష్‌రెడ్డి, తక్కెళ్ల నాగార్జున, ఎడవెల్లిచంద్రయ్య పాల్గొన్నారు.